Friendship Day 2023: మీ స్పెషల్ ఫ్రెండ్ కోసం.. స్పెషల్ గిఫ్ట్ ఐడియాస్ మీకోసం

Published : Aug 05, 2023, 04:30 PM IST

Friendship Day 2023: ఈ ఏడాది అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డేను ఆగస్టు 6 న జరుపుకోబోతున్నాం. అంటే రేపే ఫ్రెండ్ షిప్ డే. మరి ఈ సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్ కు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Friendship Day 2023: మీ స్పెషల్ ఫ్రెండ్ కోసం.. స్పెషల్ గిఫ్ట్ ఐడియాస్ మీకోసం

మన స్నేహితులు మనకు ఎంత ముఖ్యమో చూపించే సమయం వచ్చేసింది. అదేనండి ఫ్రెండ్ షిప్ డేను సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది. రేపే ఫ్రెండ్ షిప్ డే. మరి ఈ స్పెషల్ డే సందర్భంగా నచ్చిన దోస్తుకు స్పెష్ గిఫ్ట్ లను ప్రజెంట్ చేస్తుంటారు. మరి ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్పెషల్ ఫ్రెండ్ కోసం కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్ ఐడియాలు మీకోసం.. 
 

25

ఫోటో కొలాజ్ 

ఫోటో కొలాజ్ అనేది మీ ఫ్రెండ్ ను మీరు ఎంతగా అభినందిస్తున్నారో, ప్రేమిస్తున్నారో చూపించడానికి మీరు కలిసి పంచుకున్న అన్ని అందమైన సమయాలను వారికి గుర్తు చేయడానికి ఒక అద్భుతమైన మార్గమిది. మీ ఇద్దరు కలిసి దిగిన అందమైన ఫోటోలను సేకరించి ఒక అందమైన కొలాజ్ ను తయారు చేయండి. అంతేకాదు స్నేహితుడిపై మీకున్న అభిప్రాయాన్ని కూడా ఓ పేపర్ పై రాయండి. 
 

35

మెమొరీ జార్ ను తయారు చేయండి

మెమరీ జార్ అనేది మీ స్నేహితుడికి వారి స్నేహం మీకు ఎంత ముఖ్యమో వారికి చూపించడానికి ఒక గొప్ప మార్గం. మీకు ఇష్టమైన జ్ఞాపకాలన్నీ సేకరించి కాగితంపై రాయండి. మీ ఫ్రెండ్ ఈ జార్ ను తెరిచినప్పుడు మీరు కలిసి పంచుకున్న తీపి జ్ఞాపకాలన్నింటినీ చదవండి.

45

గిఫ్ట్ బాస్కెట్

ఫ్రెండ్షిప్ డే రోజున మీరు ఇవ్వగల ఉత్తమ బహుమతులలో గిఫ్ట్ బాస్కెట్ ఒకటి. మీరు చేయగలిగే అత్యంత వ్యక్తిగత బహుమతులలో ఇది కూడా ఒకటి. అందుకే మీ స్నేహితుడికి ఇష్టమైన స్నాక్స్ నుంచి వారు చదవడానికి ఇష్టపడే పుస్తకాల వరకు అన్ని ఇష్టమైన వస్తువులతో దీన్ని నింపండి. మీరు ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్స్ లేదా హ్యాండ్మేడ్ కార్డులు వంటి కొన్ని ఇంట్లో తయారుచేసిన వస్తువులను కూడా దీనిలో పెట్టొచ్చు. 
 

55

గిఫ్ట్ కార్డ్ 

మీ స్నేహితుడికి ఏది ఇష్టమో.. మీకు ఖచ్చితంగా తెలియకపోతే  గిఫ్ట్ కార్డ్ ను ఎంచుకోవడమే బెటర్. మీరు వారికి ఇష్టమైన స్టోర్ లేదా రెస్టారెంట్ నుంచి ఒకదాన్ని ఎంచుకోండి. దీంతో వారు కోరుకునే లేదా అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు. లేదా ఆన్లైన్ కోర్సు వంటి కొత్తదాన్ని నేర్చుకోవడానికి వారికి సహాయపడేదాన్ని కూడా మీరు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. 
 

click me!

Recommended Stories