ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలోనే మనకు ఎన్నో జబ్బులు అంటుకుంటాయి. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. వర్షాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే అత్యంత పోషకమైన కూరగాయలలో బోడకాకరకాయ ఒకటి. ఇది భారతదేశానికి చెందింది. దీన్ని సాంప్రదాయ భారతీయ వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అసలు వర్షాకాలంలో దీన్ని తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి
బోడ కాకరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్లు, ఖనిజాలు చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటువ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
Spiny Gourd
యాంటీఆక్సిడెంట్ కంటెంట్
బోడకాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే వర్షాకాలంలో శరీరంలో మంట కలగడం ఒక సాధారణ సమస్య.
జీర్ణ ఆరోగ్యం
బోడకాకరకాయలో డైటరీ ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థ సజావుగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే మీ ప్రేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. డయేరియా, మలబద్దకం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Spiny Gourd
బోడకాకరకాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే జలుబు, ఫ్లూ వంటి వర్షాకాల సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షించడానికి కూడా సహాయపడతాయి. బోడ కాకరకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వర్షాకాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు.
అలర్జీల అవకాశాలను తగ్గిస్తుంది
బోడకాకరకాయలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వర్షాకాలంలో అలెర్జీలు వచ్చే అవకాశాలను తగ్గించడానికి సహాయపడతాయి. బోడకాకరకాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వర్షాకాలంలో చర్మపు దద్దుర్లు లేదా ఇతర రకాల అలెర్జీ ప్రతిచర్యలు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.