చేయడానికి ఏమీ లేనప్పుడు ఇవి చేస్తే చాలా సరదాగా ఉంటుంది..!

First Published | Nov 28, 2023, 11:43 AM IST

ఇంట్లో లేదంటే, అవుట్ డోర్ లో వ్యాయామం చేయడం మంచిది. లేదంటే యోగా చేయడం, ఆన్ లైన్ లో చూసి వ్యాయామం చేయడం లాంటివి కూడా చేయవచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది.

మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పని ఉంటుంది. కానీ ఏదో ఒక సమయంలో మనకు ఏ పనీ ఉండకుండా, ఫ్రీగా ఉంటాం. ఆ సమయంలో ఏ పని చేయాలని అనిపించదు. చేయడానికి పని కూడా ఉండదు. అలాంటి సమయంలో మనం రీఫ్రెష్ గా ఫీలయ్యేలా కొన్ని పనులు చేయవచ్చట. అవేంటో ఓసారి చూద్దాం..
 

1.ఏ పని చేయాలని లేని సమయంలో రీఫ్రెషింగ్ గా ఉండేందుకు నేచర్ ని మీరు ఆస్వాదించవచ్చు. చక్కగా పక్కనే ఉన్న పార్క్ కి వెళ్లొచ్చు. లేదంటే ఏదైనా రిజ్వాయర్ లాంటి ప్రదేశాలకు వెళ్లొచ్చు. అక్కడ స్వచ్ఛమైన గాలి మిమ్మల్ని రీఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది. చుట్టూ ఉన్న బ్యూటీని చూసి ఆనందివచ్చు.
 

Latest Videos


Image: Getty Images

2. ఖాళీగా ఉన్నప్పుడు బుర్రలో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొందరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తాయి. అలా ఖాళీగా ఏవేవో ఆలోచించే బదులు, ఏదైనా పుస్తకం చదవచ్చు. ఏదైనా మంచి పుస్తకం  చదవడం లేదంటే, ఆడియో బుక్స్ వినడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల , మీ తెలివితేటలు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు. మంచి కథల పుస్తకం అయినా చదవచ్చు.
 

3.ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిది. కాబట్టి, ఖాళీగా ఉన్న సమయంలో ఫోన్ చేస్తూ, పిచ్చి ఆలోచనలతో టైమ్ వేస్ట్ చేసుకునే బదులు వ్యాయామం చేయడం ఉత్తమం. ఇంట్లో లేదంటే, అవుట్ డోర్ లో వ్యాయామం చేయడం మంచిది. లేదంటే యోగా చేయడం, ఆన్ లైన్ లో చూసి వ్యాయామం చేయడం లాంటివి కూడా చేయవచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది.

4.ఖాళీగా ఉన్నామని ఊరికే కూర్చోవడం, నిద్రపోవడం లాంటివి చేయకుండా ఆన్ లైన్ లో  ఏవైనా కోర్సు నేర్చుకోవచ్చు. ఈ రోజులలో ఆన్ లైన్ లో చాలా సమాచారం అందుబాటులో ఉంటోంది. కాబట్టి, ఖాళీగా సమయం వేస్ట్ చేసే బదులు, పనికొచ్చేది ఏదైనా నేర్చుకోవడం ఉత్తమం.
 

helping hands

5.ఇవన్నీ కాదు అంటే, ఏదైనా మంచి పని చేయవచ్చు. అంటే, ఏదైనా స్వచ్ఛంద సంస్థకు వాలంటరీగా పని చేయవచ్చు. దగ్గరలోని కమ్యూనిటీ సెంటర్ లు వెతికి, లేదంటే ఆన్ లైన్  ప్లాట్ ఫామ్స్ లో వెతికి అయినా ఆ ప్లేస్ కి వెళ్లి, మీకు తోచిన సహాయం చేయవచ్చు. 

watching tv

6.ఇవన్నీ కాదు అంటే, మీకు బాగా నచ్చిన టీవీ షో లేదంటే సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడండి. దీని వల్ల, ఫ్యామిలీ తో సమయం గడిపినట్లు ఉంటుంది.  అదేవిధగంగా మీరు ఆ ప్రోగ్రాంలను ఆస్వాదించినవారు కూడా అవుతారు.


7.మెడిటేషన్ చేయవచ్చు. మెడిటేషన్ మానసిక ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఆన్ లైన్ లో సైతం మెడిటేషన్ చేసే అవకాశం ఉంటుంది.  ఫ్రీగా మెడిటేషన్ క్లాసెస్ చెప్పేవారు కూడా ఉంటారు. లేదంటే, ఏదైనా దగ్గర  ఉన్న మెడిటేషన్ క్లాసుల్లో అయినా జాయిన్ అవ్వచ్చు. లేదంటే, మీలోని స్పెషల్ టాలెంట్ ని బయటపెట్టొచ్చు. 

click me!