Vegetables: ఈ కూరగాయలను పచ్చిగా అస్సలు తినకూడదు తెలుసా..?

Published : Mar 11, 2025, 12:29 PM IST

కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఇంకా పచ్చి కూరగాయల గురించి అయితే చెప్పనవసరం లేదు. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే కొన్ని కూరగాయల్ని మాత్రం పచ్చిగా అస్సలు తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

PREV
15
Vegetables: ఈ కూరగాయలను పచ్చిగా అస్సలు తినకూడదు తెలుసా..?

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని కూరగాయల్ని మనం వండుకొని తింటాం. కొన్నింటిని పచ్చిగా సలాడ్ రూపంలో తింటాం. పచ్చి కూరగాయలు బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని కూరగాయల్ని పచ్చిగా అస్సలు తినకూడదు. అవి మీ ఆరోగ్యానికి మేలు చేసే బదులు కీడు చేస్తాయి. ఆ కూరగాయలెంటో ఇక్కడ చూద్దాం.

25
బ్రోకోలీ

బ్రోకోలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ లాంటి కూరగాయలు. వీటిని చాలామంది పచ్చిగా తింటారు. కానీ ఈ కూరగాయల్ని ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. వీటిని ఆవిరిలో ఉడికించి తినాలి. అప్పుడే అవి తేలిగ్గా జీర్ణమవుతాయి. పోషకాలు కూడా పూర్తిగా అందుతాయి. 

35
పాలకూర

పాలకూరను చాలామంది ఇష్టంగా తింటారు. ఇది రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ చాలామంది దీన్ని పచ్చిగా తినడానికి అలవాటు పడతారు. అలా తినడం ఆరోగ్యానికి మేలు చేసే బదులు కీడు చేస్తుంది. ముఖ్యంగా పాలకూరను జ్యూస్ గానో, సలాడ్ రూపంలోనో పచ్చిగా తినకూడదు. పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది.

45
వంకాయ

వంకాయ దాదాపు అందరి ఇళ్లల్లో ఉండే కూరగాయల్లో ఒకటి. దీంతో సాంబార్, పులుసు, వేపుడు, కూర లాంటి ఎన్నో రకాల వంటలు చేస్తారు. కానీ దాన్ని ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. అది ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే వంకాయలో సోలనైన్ అనే ఆల్కలాయిడ్ సమ్మేళనం ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

55
పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్ని శాకాహారులు, మాంసాహారులు ఇద్దరూ చాలా ఇష్టంగా తింటారు. కొందరు వాటిని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. అలా తినడం తప్పు. పుట్టగొడుగుల్ని వండకుండా ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే వాటిలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. వాటిని నేరుగా తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. పుట్టగొడుగుల్ని ఎప్పుడూ బాగా కడిగి వండి తినాలి.

click me!

Recommended Stories