మహాభారతం చదివిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరో మీకు తెలుసా?

First Published | Sep 24, 2024, 7:38 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒకరు మహాభారతం చదివారని మీకు తెలుసా? ఆయనే కాదు అణు బాంబు కనిపెట్టిన రాబర్ట్ హైమర్, ప్రముఖ సంగీత కళాకారుడు జార్జ్ హారిసన్, అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ లాంటి ఎంతో మంది విదేశీ ప్రముఖులు మన మహాభారతం గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

మహాభారతం కేవలం ఇండియాకు సంబంధించినది మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన భారతీయ ఇతిహాసం. హిందూ ధర్మం మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి గ్రంథాల్లో చెప్పిన విషయాలను ఆచరించేలా ప్రోత్సహిస్తుంది. అంత గొప్ప మహాభారతాన్ని మోదీ, యోగి, పవన్ కల్యాణ్ లాంటి పొలిటీషియన్స్ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇండియన్స్ మాత్రమే మహాభారతాన్ని ఫాలో అవుతారు అనుకుంటున్నారా? విదేశాల్లోనూ మన మహాభారతం చాలా ఫేమస్. అనేక మంది ఫేమస్ విదేశీ రైటర్స్, డైరెక్టర్స్  మహాభారతంలోని విషయాలను వారి సినిమాల్లో చూపించారు. క్యారెక్టర్స్ ను క్రియేట్ చేసి సూపర్ మూవీస్ కూడా తీశారు. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా ఫేమస్ పొలిటీషిన్స్, బిజినెస్ మెన్ తదితరులు కూడా మహాభారతంలోని మంచి విషయాలను స్ఫూర్తిగా తీసుకొన్నారట. ఆ వ్యక్తులు ఎవరు? ఏ సందర్భాల్లో మహాభారతం గురించి చెప్పారు? మొదలైన విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. 

రాబర్ట్ జె.ఒపెన్ హైమర్
Father of Atomic Bombగా పేరు పొందిన రాబర్ట్ జె.ఒపెన్ హైమర్ అమెరికాకు చెందిన ఫిసిక్స్ సైంటిస్ట్. 1945 జులై 16న న్యూమెక్సికోలోని ఆలమోగార్డో సమీపంలో మొదటి అణు బాంబు పరీక్ష విజయవంతం అయ్యాక ఆయన ప్రసంగించారు. ఆ సందర్భంలో హైమర్ మహాభారతంలోని భగవద్గీతలో ఓ ఇంపార్టెంట్ వాక్యాన్ని గుర్తు చేసుకున్నారు. అదేంటంటే ‘కాలోస్మి లోకక్షయకృత్’ అంటే ‘ఇప్పుడు నేను లోకాలను నాశనం చేసే మృత్యువుగా మారాను.’ అని అర్థం. ఇది భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. 

ఒపెన్ హైమర్ భారతీయ తత్త్వశాస్ర్తంపై, ముఖ్యంగా భగవద్గీతపై చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. భగవద్గీతను ఇంగ్లీష్ లో చదివి తన జీవితంలో కొన్ని ప్రధాన సందర్భాల్లో సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారట. అణుబాంబును డెవలప్ చేసే టైంలో ఆయన ఎక్కువగా భగవద్గీతలోని కర్మ సిద్ధాంతం, ధర్మం, బాధ్యత తదితర విషయాలను ఎక్కువగా ఆలోచించేవారట.
 


జార్జ్ హారిసన్
జార్జ్ హారిసన్ బ్రిటిష్ సంగీతకారుడు. అంతేకాకుండా ‘The Beatles’ బ్యాండ్ సభ్యుడు. భారతీయ ఆధ్యాత్మికత, ధార్మిక గ్రంథాలపై ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. మహాభారతం, భగవద్గీత హారిసన్ జీవితంపై ఎంతో ప్రభావం చూపించాయి. 
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయిన రవిశంకర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 1960లో హారిసన్ భారతీయ గ్రంథాలు చదవడం ప్రారంభించారు. 
ఓ ఇంటర్వూలో హారిసన్ భగవద్గీత గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని, అది ఒక మార్గదర్శకం అని పేర్కొన్నారు. ఇది ఈ విశ్వంలో మన పాత్ర ఏంటో వివరంగా చెబుతుందన్నారు. తన జీవితంలోని వచ్చిన కష్టాలు, ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికి భగవద్గీత ఉపయోగపడిందన్నారు. 
మహా భారతంలోని అనేక పాత్రలు, ప్రేరణతో కొన్ని పాటలు కూడా రాశారు. ‘Living in the Material World’ అనే ఆల్బమ్ లో ఎంతో ఆధ్యాత్మకమైన విషయాలను ప్రస్తావిస్తూ పాటలు రాశారు.
 

జార్జ్ లూకాస్
స్టార్ వార్స్ క్రియేటర్ అయిన జార్జ్ లూకాస్ మహాభారతం, రామాయణం వంటి పురాణాల్లో పాత్రలను ప్రేరణగా తీసుకొని తన స్టార్ వార్స్ సిరీస్ లో క్యారెక్టర్స్ ను తయారు చేశారు. ఆధ్యాత్మికత, కర్మతత్వం, ధర్మ పోరాటం వంటి సందర్భాలను ఆయన తన సినిమాల్లో చూపించారు. 
భారతీయ, గ్రీక్ ఇతిహాసాలు తనపై ఎంతో ప్రభావం చూపాయని పలు సందర్భల్లో లూకాస్ అన్నారు. 
 

సునీతా విలియమ్స్
అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్ మహాభారతం, భగవద్గీత గురించి 2007లో ఓసారి ప్రస్తావించారు. ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో ఉన్నప్పుడు సునీత విలియమ్స్ తనతో పాటు భగవద్గీత పుస్తకాన్ని, ఒక గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లారు.

భగవద్గీత తనకు శాంతి, బలాన్ని ఇస్తుందన్నారు. ఈ పుస్తకంలో ఉన్న ధార్మిక తత్వం ఆమెకు ఆత్మీయ స్పూర్తిగా నిలిచిందని చెప్పింది. అంతరిక్షంలో మన భూమి కేవలం ఒక అణువు కంటే తక్కువని తెలిసి ఇక్కడ మన కర్తవ్యం, ధ్యేయం గురించి భగవద్గీత ఆలోచించేలా చేసిందని తెలిపారు. భగవద్గీతలోని కర్మ సిద్ధాంతం, ధర్మం గురించి చెప్పిన విషయాలు తనకు శక్తినిచ్చాయని ఆమె పేర్కొన్నారు.

సునీత గణేష్ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లడం ద్వారా అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు కూడా ఆమె తన భారతీయ మూలాలపై గౌరవాన్ని చూపించారు. గణేష్ విజయానికి ప్రతీక. ప్రాబ్లమ్స్ ను తొలగించేవాడని భావిస్తారు. ఈ సాన్నిహిత్యం అంతరిక్షంలో ఉన్నప్పుడు తనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని సునీత పలు సందర్భాల్లో చెప్పారు. 

బరాక్ ఒబామా
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా మహాభారతం గురించి 2020లో తన ఆత్మకథ ‘A promised Land’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఈ బుక్ లో ఇండియాపై తన అభిప్రాయాలు, భారత దేశం అంటే తనకు ఎందుకు ఇష్టం, రాజకీయ విషయాల గురించి వివరించారు. తాను మహాభారతం చదివానని, ఇందులోని క్యారెక్టర్స్ వల్ల తాను విలువలు, నైతికత నేర్చుకున్నానని ఆయన ఇండియా వచ్చిన సందర్భంలో అన్నారు. రామాయణం కూడా ఒబామా చదివారట. ఈ రెండు ఇతిహాసాల్లో క్యారెక్టర్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వాటిని తన రాజకీయ నాయకత్వానికి ఉపయోగించుకున్నానని పేర్కొన్నారు. 
 

Latest Videos

click me!