జుట్టు బాగా రాలుతోందా? వీటిని తినండి ఇకనుంచి అస్సలు ఊడదు

First Published | Oct 29, 2023, 3:10 PM IST

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో పోషకాల లోపం ఒకటి. అందుకే జుట్టుకు అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే జుట్టు రాలే అవకాశం తగ్గుతుంది.
 

hair fall


అందమైన, పొడవాటి, ఒత్తైన జుట్టును కోరుకోని వారుండరు. జుట్టు చిన్నగా ఉన్నవారు జుట్టు పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో పోషక లోపం ఒకటి. అవును మన జుట్టుకు అవసరమైన పోషకాలు లేకపోతే కూడా జుట్టు విపరీతంగా రాలడం మొదలవుతుంది. జుట్టు రాలడం ఆగడానికి, ఆరోగ్యకరంగా జుట్టు పెరగడానికి ఆహారం ఎంతో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. గుడ్లు బచ్చలికూర వంటి కొన్ని ఆహారాలను తింటే జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. మరి జుట్టు రాలడం ఆగడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పప్పుధాన్యలు

పప్పుధాన్యాలు మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. పప్పుధాన్యాలను తింటే మనం ఎన్నో పోషక లోపానికి దూరంగా ఉంటాం. పప్పులు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. వీటిలో జింక్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి జుట్టును రాలకుండా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 


hair care

చిలగడదుంప

తీపి బంగాళాదుంపలు లేదా చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కూడా పోషకాలకు మంచి వనరులు. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే తీపి బంగాళాదుంపను మీ రోజువారి ఆహారంలో చేరిస్తే మీ జుట్టు ఊడటం చాలా వరకు ఆగుతుంది. అలాగే ఒత్తుగా పెరుగుతుంది. 
 

బెర్రీలు

బెర్రీలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడం నుంచి రక్తపోటును తగ్గించడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బెర్రీలు కూడా పోషకాలకు మంచి వనరులు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలను తింటే జుట్టు రాలడం ఆగుతుంది. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 
 

అవొకాడో

అవొకాడోల్లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలెన్నో ఉంటాయి. అవొకాడాల్లో విటమిన్ ఇ, బయోటిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి అవొకాడోలను తింటూ కూడా జుట్టు రాలడం ఆగుతుంది. అలాగే ఫాస్ట్ గా జుట్టు పెరుగుతుంది. 
 

Latest Videos

click me!