మీ పిల్లల ఎదుగుదల బాగుండాలంటే ఇవి తినిపించండి

First Published Dec 1, 2022, 3:00 PM IST

పిల్లలకు సమతుల్య ఆహారం తినిపించాలి. అప్పుడే మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందుకోసం వాళ్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే.. 
 

పిల్లలకు, పెద్దలకు పౌష్టికాహారం ఇవ్వాలి. కానీ పెద్దల మాదిరిగా కాకుండా పిల్లలకు వేర్వేరు మొత్తంలో నిర్దిష్ట పోషకాలను అందించాల్సి ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదుగేందుకు తగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇయితే ఇందుకోసం వాళ్ల వయస్సు, యాక్టివిటీ లెవల్, ఇతర కారకాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 
 

kids

సమతుల్య ఆహారం పిల్లల శక్తి స్థాయిని పెంచడానికి, వాళ్ల ఎముకలను బలోపేతం చేయడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి, ఆరోగ్యకరమైన బరువును పెంపొందించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పిల్లలకు పెట్టే ఆహారంపైనే వారి శారీరక ఎదుగుదల ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం.. స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడే ఆహారాల్లో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు,ప్రోటీన్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.

kids

కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి టైప్ 1 పోషకాలు శరీరంలో నిల్వ చేయబడతాయి. పిల్లల శరీరంలో ఈ పోషకాలు క్షీణించినప్పుడు.. వీటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ పోషకాల లోపం పిల్లల పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. 

childrens food

కొత్త కణాలు, కణజాలాలను ఏర్పడటానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, సల్ఫర్, జింక్, మెగ్నీషియం, ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు వంటి టైప్ 2 పోషకాలు కూడా పిల్లలకు అవసరమవుతాయి. వీటి లోపం ఉంటే పిల్లల ఎదుగుదల మందగిస్తుంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు టైప్ 2 పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అందించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు వారికి ఎలాంటి ఆహారాలను ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గుడ్డు

టైప్ 1,  టైప్ 2 అనే రెండు పోషకాలకు గుడ్లు అద్భుతమైన మూలం. పిల్లలు గుడ్డును పచ్చసొనతో సహా తింటే బిడ్డ శక్తివంతంగా ఉంటాడు. అలాగే వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గుడ్లలో అయోడిన్, ఇనుము, నాణ్యమైన ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వులు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి 12 లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.  దీనిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల పిల్లలో ఏకాగ్రత, శక్తి స్థాయిలు పెరుగుతాయి. 
 

గింజలు

గింజలు, విత్తనాల్లో ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పిల్లల  ఆరోగ్యం బాగుండటమే కాదు.. వారి శారీరక పెరుగుదల కూడా బాగుంటుంంది. గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు తెలివితేటల అభివృద్ధికి తోడ్పడతాయి.
 

బీన్స్

సోయాబీన్స్, కాయధాన్యాల్లో అమైనో ఆమ్లాలు, ఫోలేట్లు, మెగ్నీషియం మొదలైన వాటికి మంచి వనరులు. అవి చాలా వైవిధ్యమైనవి. వీటిలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. వారి తెలివి తేటలను కూడా పెంచుతాయి.
 

చేప

ఫ్యాటీ చేపలు EPA, DHA వంటి ఆవశ్యక కొవ్వు ఆమ్లాలకు మంచి వనరు. 3 సంవత్సరాల వయస్సులో వారి మెదడు పెద్దల పరిమాణంలో 80% వరకు పెరుగుతుంది. 5 సంవత్సరాల వయస్సు నాటికి ఇది 90% చేరుకుంటుంది. పిల్లల మెదడు అభివృద్ధిలో ఇపిఎ, డిహెచ్ఎ కీలక పాత్ర పోషిస్తాయి.

click me!