కరోనా కాలంలో పెరిగిన బరువు తగ్గించుకునే సింపుల్ టిప్స్...

First Published Aug 20, 2021, 12:47 PM IST

ఇంట్లోనే ఉండడం, బయటి ఆహారం లేకపోవడం... ఎక్కువ సమయం వేరే యావగేషన్ లేకపోవడం చాలామందిలో ఊబకాయానికి దారి తీసింది. దీంతో అధిక బరువును తగ్గించుకునే దిశగా ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనుకోకుండా పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలో తెలీక, ఒకవేళ డైటింగ్ లాంటి వాటివల్ల రోగనిరోధక శక్తి తగ్గితే కరోనా కాటేస్తుందేమో అనే భయంతో అయోమయంలో పడేలా చేస్తుంది. 

కరోనా మహమ్మారి జీవనవిధానంలో ఎన్నో మార్పులు చేసింది. నిత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది. దీంతోనే కొంతమందిలో మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసింది. లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం జీవితాల్ని తలకిందులుగా చేశాయి. 

ఇంట్లోనే ఉండడం, బయటి ఆహారం లేకపోవడం... ఎక్కువ సమయం వేరే యావగేషన్ లేకపోవడం చాలామందిలో ఊబకాయానికి దారి తీసింది. దీంతో అధిక బరువును తగ్గించుకునే దిశగా ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనుకోకుండా పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలో తెలీక, ఒకవేళ డైటింగ్ లాంటి వాటివల్ల రోగనిరోధక శక్తి తగ్గితే కరోనా కాటేస్తుందేమో అనే భయంతో అయోమయంలో పడేలా చేస్తుంది. 

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో బరువు పెరిగితే.. శరీరంలోని అధిక కొవ్వును తొలగించుకోవాలనుకుంటే ఇప్పుడు ఇది.. సరైన సమయం.. దీనికోసం కొన్ని చిట్కాలు, ఉపాయాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఈజీగా, ఇబ్బంది లేకుండా బరువు తగ్గొచ్చు. మీ మునుపటి శరీరాకృతిని పొందవచ్చు. 
మీరు చాలా బరువు పెరిగిన మరియు అదనపు కొవ్వు పేరుకుపోయిన వ్యక్తి అయితే, వాటిని వదిలించుకోవడానికి ఇది మంచి సమయం. అలా చేయడానికి, ఇక్కడ కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలు ఉన్నాయి.

weight loss

దీనికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. భోజనాన్ని అస్సలు మానేయద్దు. లాక్డౌన్లు, క్వారంటైన్, వర్క్ ఫ్రం హోం లాంటివి.. ఆహారపు అలవాట్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇంట్లోనే ఉండడం వల్ల ఏదో ఒకటి తినేయడం.. చిరుతిండి... దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో చాలా మార్పు వచ్చింది. ఇది అధిక బరువుకు దారి తీసింది. 
అప్పటివరకు కఠినంగా అమలు చేసిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దీనికోసం కాస్త కష్టమైన మళ్లీ స్ట్రిక్ట్ గా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మొదలుపెట్టండి. భోజనంలో అన్నిరకాల పోషకాలు, తక్కువ కేలరలు ఉండేలా చూసుకోండి. నోటికి కాస్త తాళం వేసి.. అతిగా తినడాన్ని కంట్రోల్ చేసుకోండి. 

వ్యాయామం మామూలు సమయం కంటే ఇప్పుడు చాలా అవసరం. ఇది బరువును తగ్గించడమే కాకుండా.. మానసిక, శారీరక ఆరోగ్యానికీ బాగా ఉపయోగపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. అయితే ఇది బరువు తగ్గడంలో మీ చివరి ప్రయత్నంగా ఉండకూడదు. క్రమం తప్పని వ్యాయామం, శారీరక కదలికలతో  కొన్ని కిలోల బరువు తగ్గి, ఆరోగ్యకరమైన బరువుకు తిరిగి వస్తారు. ఇలా రాగానే వ్యాయామాన్ని ఆపేయడం సరికాదు. మీరు అనుకున్న గోల్ రీచ్ అయినా..  వ్యాయామాన్ని మానొద్దు. శారీరక శ్రమను వదిలిపెట్టొద్దు. దీర్ఘకాలిక అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి, వయసు మీద పడిన తరువాత కూడా ఆరోగ్యంగా ఉండడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. దీనికోసం యోగా, జిమ్, ఎక్సర్ సైజులలాంటివి తప్పనిసరి మీ డైలీ రొటీన్ లో చేర్చాలి. 

మానసిక ఒత్తిడి.. శరీరం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కరోనా మనుషుల మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. 
ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారని మనందరికీ తెలిసిందే. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి తినాలనే కోరికలను పెంచుతుంది. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలకోసం వెంపర్లాడేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, నరాలను శాంతపరచడానికి సహాయపడే శ్వాస వ్యాయామాలను సాధన చేయాలి. యోగాచ ధ్యానంలాంటివాటిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఒత్తిడిని మీ మనసులోనే ఉంచుకోకండి. నలుగురితో మాట్లాడడం వల్ల దాన్నుంచి బయటపడొచ్చు.  

పూర్తి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఈ మధ్యే మీరు మీ ఆహారం, ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నట్లైతే... బరువు తగ్గడం ఒక్కటే అల్టిమేట్ గోల్ కాకూడదు. మొత్తం శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.  పోషకాహారం మీద దృష్టి పెట్టినా, వ్యాయామాన్ని ఎంచుకున్నా శారీరక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడానికి పనికొస్తుందని నిర్థారించుకోవాలి. దీనికోసం అనవసరమైన ఆహారం తీసుకోవద్దు. భోజనం మానుకోవద్దు. ఎందుకంటే ఇది మిమ్మల్ని మరింత బలహీనంగా, తక్కువ శక్తివంతంగా చేస్తుంది... ఇది మీ రోజువారీ పనులు చేయకుండా నిరోధిస్తుంది.

click me!