Bathroom Cleaning: బాత్రూమ్ టైల్స్ ఎంత క్లీన్ చేసినా మరకలు వదలడం లేదా. వాటిని శుభ్రం చేసి మీ చేతులు నొప్పి పెడుతన్నాయా? అయితే… ఎక్కువ కష్టపడకుండా టైల్స్ ని ఈజీగా శుభ్రం చేయవచ్చు. కొత్త వాటిలా మెరిసేలా చేయవచ్చు.
ఇంట్లో అన్ని ప్రదేశాల్లో కంటే బాత్రూమ్ లోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే, ఎప్పటికప్పుడు బాత్రూమ్ శుభ్రపరుస్తూ ఉండాలి. చాలాసార్లు మనం ఎంత శుభ్రం చేసినా కూడా బాత్రూమ్ టైల్స్ కి పట్టిన మరకలు అంత సులభంగా వదలవు. దీంతో.. చాలా గట్టిగా రుద్దాల్సి ఉంటుంది. అయితే.. మీరు ఎంత శుభ్రం చేసినా టైల్స్ మరకలు వదలడం లేదు అనుకుంటే… ఈ చిట్కాలు మీ కోసమే. వీటితో శుభ్రం చేస్తే.. ఎలాంటి మొండి మరకలు అయినా సులభంగా వదులుతాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
మీ ఇంట్లో బంగాళదుంప ఉంటే… దానితో టైల్స్ ని కొత్తగా మార్చేయవచ్చు. దీని కోసం.. ముందుగా ఒక బంగాళదుంప తీసుకొని ముక్కలుగా కోసి మిక్సీ పట్టాలి. దీని రసం తీసి.. కొద్దిగా వేడి నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని బాత్రూమ్ టైల్స్, మూలల్లో స్ప్రే చేసి 10 నిమిషాలు వదిలేయాలి. బంగాళదుంపలో ఉండే స్టార్చ్, యాసిడ్ గుణాలు టైల్స్ పై పేరుకుపోయిన మరకలు చాలా ఈజీగా వదులుతాయి. మెల్లగా స్క్రబ్ చేస్తే.. టైల్స్ కొత్త వాటిలా మెరుస్తూ కనపడతాయి.
25
నిమ్మ-ఉప్పు స్క్రబ్
ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై వంట ఉప్పు (సన్న ఉప్పు) చల్లండి. దీన్ని నేరుగా టైల్స్ మరకలపై రుద్దండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్, ఉప్పులోని గరుకుదనం కలిసి ఖరీదైన క్లీనర్ల కన్నా వేగంగా మరకలను తొలగిస్తాయి. బాత్‌రూమ్ కూడా మంచి సువాసనతో నిండిపోతుంది.
35
మౌత్‌వాష్ మ్యాజిక్
టైల్స్ మధ్యలో ఉండే తెల్లటి గీతల్లో (గ్రౌట్) నల్లటి మరకలు పట్టాయా? ఇంట్లో ఉండే పుదీనా ఫ్లేవర్ మౌత్‌వాష్‌ను పాత బ్రష్‌తో ఆ ప్రదేశాల్లో రుద్దండి. మౌత్‌వాష్‌లోని యాంటీసెప్టిక్, ఆల్కహాల్ గుణాలు అక్కడ పేరుకున్న ఫంగస్, బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేసి, నలుపు రంగును మాయం చేస్తాయి.
ఏదైనా చవకైన షాంపూలో కొద్దిగా బేకింగ్ సోడా (వంట సోడా) కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని టైల్స్‌పై రాసి 5 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి. షాంపూ సువాసన, బేకింగ్ సోడా మురికిని తొలగించే గుణం కలిస్తే.. మరకలు మాయమైపోతాయి.
55
కొవ్వొత్తి ట్రిక్
టైల్స్‌ను శుభ్రం చేశాక, అవి ఎప్పుడూ శుభ్రంగా ఉండటానికి ఒక మార్గం ఉంది. టైల్స్ మధ్యలో ఉన్న తెల్లటి గీతలపై ఒక సాధారణ తెల్ల కొవ్వొత్తితో మెల్లగా రుద్దండి. ఈ మైనం ఒక వాటర్ ప్రూఫ్ పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల మీరు స్నానం చేసినప్పుడు సబ్బు నీరు గానీ, ఉప్పు నీరు గానీ ఆ గీతల్లో చేరదు. మరకలు కూడా పట్టవు.