ఆడవాళ్లకు గుండెజబ్బులు రావడానికి కారణాలు ఇవే..!

Published : Oct 28, 2022, 04:55 PM IST

మగవాళ్లతో పాటుగా ఆడవాళ్లు కూడా గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారు. వంశపారంపర్య కారకాల నుంచి ఒత్తిడి, మానసిక సమస్యలు వంటివి దీనికి కారణాలు.   

PREV
17
ఆడవాళ్లకు గుండెజబ్బులు రావడానికి కారణాలు ఇవే..!

ఈ రోజుల్లో గుండె జబ్బులు సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కారణంగా చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పెద్ద వయసు వారే కాదు యువత కూడా గుండెపోటు, గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
 

27

ఈ గుండె జబ్బులు పురుషులకు కాదు మహిళలకు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. వంశపారంపర్య కారకాల నుంచి ఒత్తిడి, నిరాశ వంటి మానసిక ఆరోగ్య కారకాలు ఇందుకు కారణం. ఆడవాళ్లకు గుండె జబ్బులు రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం పదండి. 
 

37
heart attack

డయాబెటిస్: ఆడవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరగడానికి ప్రధాన కారకాల్లో డయాబెటీస్ ఒకటి. ముఖ్యంగా ఒకసారి గుండెపోటు వచ్చిన మహిళల్లో..  ఈ మధుమేహం గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఇలాంటి వారికే గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. 

47
heart attack

స్థూలకాయం: మన దేశంలో మగవారిలో కంటే ఆడవారిలోనే ఊబకాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఊబకాయం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. రుతువిరతి దాటిన మహిళల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

57

బీపీ, కొలెస్ట్రాల్:  హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్  మీ గుండెను చాలా తొందరగా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మగవారితో పోల్చితే ఆడవారిలోనే కొలెస్ట్రాల్, హైబీపీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆడవాళ్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 

67

వ్యాయామం లేకపోవడం:  నేటికీ.. ఆడవాళ్లే ఇంటి పనులను చేస్తున్నారు. ఇంటి పనుల వల్ల  వీళ్లకు వ్యాయామం చేసే టైం అసలే ఉండదు. అందులోనూ చాలా మంది ఆడవారు పురుషులతో సమానంగా వ్యాయామం చేయరు. ఇది చివరకు గుండు జబ్బులకు దారితీస్తుంది. 

77

మద్యపానం, ధూమపానం: మహిళల కంటే పురుషులే ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. స్మోకింగ్ చేస్తారు. కానీ  ఈ అలవాట్లు కొంతమంది ఆడవారిలో కూడా కనిపిస్తుంటాయి. వీటివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories