బీపీ కంట్రోల్ లో ఉండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..

Published : Oct 28, 2022, 04:07 PM IST

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడికి గురికావడం, స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారిలో రక్తపోటు బాగా పెరుగుతుంది. అందుకే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి.   

PREV
18
బీపీ కంట్రోల్ లో ఉండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..
blood pressure

ఒకప్పుడు హై బీపీ సమస్య పెద్ద వయసు వారిలోనే కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. కానీ రక్తపోటు పెరిగితే గుండె పోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మోతాదుకు మించి ఉప్పును తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, ఊబకాయం, ఒత్తిడి వంటివి రక్తపోటును పెంచుతాయి. ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే దాన్ని పెంచే ఆహారాల జోలికి వెళ్లకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

28


ఉప్పు

నిజానికి మన శరీరానికి ఉప్పు చాలా అవసరం. అందులోనూ వంటల్లో ఉప్పు లేకుండా అస్సలు తినలేం. అలా అని ఉప్పును మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులో హై బీపీ పేషెంట్లు ఉప్పును వీలైనంత తక్కువగా తినాలి. అంటే వీళ్లు రోజుకు ఆరు గ్రాముల కంటే తక్కువ ఉప్పును తినాలన్న మాట. ఇంతకు మించి తింటే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. 
 

38

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారాలు, ఫ్రైడ్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. వీటిని తినడం తగ్గిస్తే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 
 

48

జంక్ ఫుడ్

అధిక రక్తపోటు పెషెంట్ల ఆరోగ్యానికి జంక్ ఫుడ్ ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే శాండ్ విచ్, పిజ్జా వంటి జంక్ ఫుడ్స్ లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక మీడియం సైజు పిజ్జాలో 3,500 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఒకవేళ వీటిని తింటే రక్తపోటు విపరీతంగా పెరిగి.. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. 
 

58

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసంలో ఎక్కువ మొత్తంలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ రెండు మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలకు కాస్త దూరంగానే ఉండండి. 
 

68
Image: Getty Images

చక్కెర

ఏ రకంగా చూసుకున్నా షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు చక్కెర ఏ మాత్రం ఆరోగ్యకరమైంది కాదు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే రక్తపోటు కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు శరీర బరువు కూడా దారుణంగా పెరుగుతుంది. అందుకే చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినండి. ఆరోగ్యంగా ఉంటారు. 
 

78

కెఫిన్

కెఫిన్ వల్ల మన శరీరానికి తక్షణమే శక్తి అందినప్పటికీ.. దీన్ని మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు 4 కప్పుల  కంటే ఎక్కువ కాఫీ కప్పులను తాగడం వల్ల రక్తపోటు ఎక్కువగా పెరుగుతుందని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది. అందుకే కెఫిన్ వాడకాన్ని తగ్గించండి. 
 

88

ఆల్కహాల్

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగితే కూడా రక్తపోటు పెరుగుతుంది. అమెరికన్ హార్టో అసోసియేషన్ ప్రకారం.. ఆల్కహాల్ ను మితిమీరి తాగితే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే మద్యాన్ని ఎక్కువగా తాగకండి. 

Read more Photos on
click me!

Recommended Stories