ఈ జ్యూస్ లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి..

First Published Oct 28, 2022, 2:56 PM IST

లిపిడ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ గా నారింజ జ్యూస్ ను తాగితే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. 
 

High Cholesterol


చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఒంట్లో  కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని డైటరీ సప్లిమెంట్ల ద్వారా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ను తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

లిపిడ్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా నారింజ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయట. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. 
 

orange juice

ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ ను తాగేవారిలో ఈ పరిశోధన ముగిసే సమయానికి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ 18 శాతం తగ్గినట్టు తేలింది. నారింజ రసంలో ఎక్కువ మొత్తంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. శరీరంలోని అనవసరమైన కొవ్వును తగ్గించడంలో ఇవి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఫ్లేవనాయిడ్లు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ సీరం స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే లైంగిక అంగస్తంభన లోపంతో సహా  ఎన్నో సమస్యలకు కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

cherry

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చెర్రీ జ్యూస్ కూడా ఎంతో సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాదు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.  క్రమం తప్పకుండా చెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

టొమాటో జ్యూస్ లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మీ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాదు గుండె జబ్బులు, క్యాన్సర్, వృద్ధాప్యం, అల్జీమర్స్ వ్యాధి, స్ట్రోక్, ఇతర వ్యాధులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

click me!