Oil For White Hair: ఈ నూనె కూడా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది తెలుసా..

Published : Jun 03, 2022, 02:18 PM IST

Oil For White Hair: ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ వల్లే టీనేజర్లు కూడా తెల్ల జుట్టుబారిన పడుతున్నారు. అయితే తెల్ల జుట్టును సహాజ పద్దతుల ద్వారా కూడా నల్లగా చేయొచ్చు. 

PREV
17
Oil For White Hair: ఈ నూనె కూడా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది తెలుసా..

Oil For White Hair: ఒకప్పుడు వయసు మీద పడుతున్న వారికే తెల్ల జుట్టు వచ్చే. కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే 25 నుంచి 30 సంవత్సరాల యువత కూడా వైట్ హెయిర్ బారిన పడుతున్నారు. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్ లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ కెమికల్స్ మిక్స్ చేసిన వాటిని పెట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అయితే ఈ తెల్ల జుట్టును నాచురల్ పద్దతిలో కూడా నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

27

తెల్ల జుట్టుకు సోంపు నూనె.. చిన్నవయసులోనే తెల్ల జుట్టు రావడం మొదలైతే.. మీరు ఎలాంటి భయాలు లేకుండా సోంపు నూనెను జుట్టుకు అప్లై చేయొచ్చు. ఈ సోంపు నూనెను తరచుగా జుట్టు పెట్టడం ద్వారా జుట్టు నల్లగా నిగనిగలాడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

37

ఈ నూనె  దెబ్బతిన్న జుట్టును కూడా బాగు చేస్తుంది. ఈ నూనెను మీరు మార్కెట్ లో కొనాల్సిన అవసరం కూడా లేదు. దీనిని సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. 
 

47

సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అందుకే జుట్టుకు సోంపు నూనెను వాడాలని నిపుణులు చెబుతున్నారు. 

57

ఈ సోంపును నేచురల్ మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తారు. అలాగే తిన్నది తొందరగా అరగడానికి.. జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉండటానికి కూడా దీన్ని తింటూ ఉంటారు. కానీ ఈ సోంపు నూనె గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. 

67

సోంపు నూనెను ఎలా తయారుచేసుకోవాలి.. అరకప్పు సోంపు గింజలును తీసుకోవాలి. అలాగే కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ ను కూడా తీసుకోవాలి. నూనెను తయారుచేయడానికి.. ఒక కుండలో ఆలివ్ లేదా కొబ్బరి నూనెను పోసి అందులో సోంపు గింజలను వేయండి. దీన్ని కాసేపు మరింగించండి. బాగా మరిగిన తర్వాత  పాన్ ను మీడియం మంట మీద కాసేపు ఉడికించండి. 

77

చివరగా నూనె చల్లారిన తర్వాత దీనిని ఒక సీసాలో స్టోర్ చేసుకోండి. మీరు వాడే నూనెకు బదులుగా ఈ సోంపు నూనెను పెడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 
 

click me!

Recommended Stories