హల్దీ వేడుక తర్వాత విషాదం.. కొత్త పెళ్లి కూతురు ప్రాణం తీసిన పసుపు.. అసలేం జరిగిందటే.?

Published : May 20, 2026, 09:19 AM IST

Fake Turmeric: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో పెళ్లి వేడుకలో హ‌ల్దీ కార్యక్రమం తర్వాత వధువు మృతి చెందగా.. వరుడి ఆరోగ్యం కూడా ఒక్కసారిగా క్షీణించింది. ఈ ఘటన తర్వాత మార్కెట్‌లో అమ్ముతున్న పసుపు నిజంగా సురక్షితమేనా అనే చర్చ మొదలైంది. 

PREV
15
భారతీయ ఇళ్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యం

పసుపు భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. వంటల్లో రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా దీనిని వాడుతుంటారు. ఆయుర్వేదంలో పసుపును శరీరంలోని వాపులు తగ్గించే ఔషధంగా చెబుతారు. అలాగే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాలు కూడా పసుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే గాయాలు అయినప్పుడు, జలుబు వచ్చినప్పుడు కూడా పసుపు పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.

25
కల్తీ పసుపు ఎందుకు ప్రమాదకరం..?

ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా కనిపించే సమస్య కల్తీ పసుపు. పసుపు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు కొందరు వ్యాపారులు కృత్రిమ రంగులు, హానికర రసాయనాలు కలుపుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెరుస్తూ కనిపించే పసుపులో కల్తీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి పసుపును ఎక్కువకాలం ఉపయోగిస్తే జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే కాలేయం, కిడ్నీలపై కూడా ప్రభావం పడొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

35
ఇంట్లోనే కల్తీ పసుపును ఎలా గుర్తించాలి..?

కల్తీ పసుపును గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక సులభమైన పరీక్షను సూచించింది. దీన్ని ఇంట్లోనే కొన్ని నిమిషాల్లో చేయొచ్చు. ముందుగా రెండు గ్లాసుల్లో స్వచ్ఛమైన నీళ్లు తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు పొడి వేయాలి. ఇప్పుడు ఆ నీటిని కలపకుండా కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. పసుపు అసలైనదైతే అది నెమ్మదిగా గ్లాస్ అడుగున చేరుతుంది. నీరు లేత పసుపు రంగులో కనిపిస్తుంది. కానీ నీరు ఒక్కసారిగా ఎక్కువగా మెరుస్తూ పసుపు రంగులోకి మారితే అందులో కృత్రిమ రంగులు కలిపి ఉండే అవకాశం ఉంది.

45
పసుపు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు

పసుపు కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ నమ్మకమైన బ్రాండ్లు లేదా విశ్వసనీయ దుకాణాల నుంచే పసుపు కొనాలి. చాలా ప్రకాశవంతంగా కనిపించే పసుపును కొనకుండా ఉండటం మంచిది. ప్యాకెట్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. అలాగే పసుపును తేమ లేకుండా పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. దీంతో దాని నాణ్యత ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.

55
ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు

చిన్న విషయంలా కనిపించినా కల్తీ ఆహార పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రతిరోజూ వాడే పసుపు విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నప్పుడు నాణ్యమైన పసుపును మాత్రమే ఉపయోగించడం మంచిది. కేవలం రంగు చూసి కొనుగోలు చేయకుండా.. నాణ్యతను కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. చిన్న జాగ్రత్తతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories