సంతానం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

First Published | Sep 14, 2021, 1:16 PM IST

మాతృత్వం అనేది మహిళలకు ఎంత ముఖ్యమో.. తండ్రి అయ్యానని చెప్పుకోవడం పురుషులకూ అంతే ముఖ్యం. అయితే నేటి రోజుల్లో అనేక కారణాలు.. ఈ భావనకు యువజంటలను దూరం చేస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణాలు మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా వివాహాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. 

ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా కన్సీవ్ అవ్వడం లేదా? ట్రామాలోకి వెళ్లిపోతున్నారా? డాక్టర్ల చుట్టూ తిరిగీ, తిరిగీ అలిసి పోతున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. 

మాతృత్వం అనేది మహిళలకు ఎంత ముఖ్యమో.. తండ్రి అయ్యానని చెప్పుకోవడం పురుషులకూ అంతే ముఖ్యం. అయితే నేటి రోజుల్లో అనేక కారణాలు.. ఈ భావనకు యువజంటలను దూరం చేస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణాలు మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆలస్యంగా వివాహాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. 


తల్లిదండ్రులు కావాలన్న కోరిక తీర్చడంలో ఆరోగ్యకరమైన పోషకాహారం, బీఎంఐలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది పురుషులకు, స్త్రీలకు సమానంగా వర్తిస్తుంది. 

ముఖ్యంగా మహిళలు పోషకాహారం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల తొమ్మిదినెలల గర్భిణి సమయంలో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 

పురుషుల్లో అధిక బరువు ఉండడం కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒబేసిటీ వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి స్పెర్మ్ క్వాలిటీలో తేడాలు వస్తాయి. ఇది అంతిమంగా తండ్రి కావాలన్న కోరికను అందకుండా చేస్తుంది. 

ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏం తినాలి? అంటే.. తాజా కూరగాయలు, పండ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కన్సీవ్ ఈజీ అవుతుంది. 

పీసీఓస్, ఎండోమెట్రియోసిస్, యూటెరైన్ ఫైబ్రాయిడ్స్, ఎస్టీడీల్లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలు కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతోపాటు ఒత్తిడి, స్మోకింగ్, ఆల్కహాల్, సరిగా తినకపోవడం, నిద్రవేళలు సరిగా ఉండకపోవడం లాంటివి కూడా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. 

సరైనా ఆహారం తీసుకోవాలి. అంటే మీ ప్లేట్ లో పావు వంతు గ్రెయిన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే ప్రతీ భోజనంలోనూ 2,3 రకాల కూరగాయలు ఉండాలి. దీంతోపాటు రోజుకు రెండుసార్లు పండ్లు తీసుకోవాలి. నట్స్, సీడ్స్ వీటికి జోడించాలి. 

పాలు, పాల ఉత్పత్తులను తప్పనిసరిగా మీ డెయిలీ రొటీన్ లో చేర్చాలి. వీటివల్ల కాల్షియం, ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ అందుతుంది కాబట్టి.. సంతానం కోసం ప్రయత్నించే వారు, వెజిటేరియన్స్ కు మంచి ఆహారం ఇది. 

ఆమారంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్త పడండి. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కొన్ని రకాల విటమిన్స్ తగ్గుదల ఏర్పడి స్పైనా బిఫిడా అనే పరిస్థితి గర్భస్థ శిశువుల్లో ఏర్పడుతుంది. అంతే వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. 

Latest Videos

click me!