ఒకప్పుడు సన్నని కనుబొమ్మలనే ఇష్టపడేవారు. ఇప్పుడు హీరోయిన్ల నుంచి సాధారణ జనాల వరకు ప్రతి ఒక్కరూ మందపాటి, ఒత్తైన కనుబొమ్మలనే ఇష్టపడుతున్నారు. అయితే కొంతమందికి తలలోని వెంట్రుకల మాదిరిగానే కనుబొమ్మల వెంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి. కనుబొమ్మల జుట్టు రాలడానికి అంతర్గత, బాహ్య కారణాలు ఉండొచ్చు. అలాగే ఓవర్ థింకింగ్ వంటి చిన్న సెలూన్ ప్రమాదాలు లేదా అలోపేసియా, విటమిన్ లోపాలు, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఊడిపోతాయని నిపునులు చెబుతున్నారు. మరి కనుబొమ్మలు ఎందుకు రాలుతాయి? వీటిని ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.