డయాబెటీస్ పేషెంట్లు డార్క్ చాక్లెట్ తినొచ్చా?

First Published | Dec 6, 2023, 12:44 PM IST

డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలన్నా, వీరి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏవి పడితే అవి తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అయితే మధుమేహులు డార్క్ చాక్లెట్లను తినొచ్చా? లేదా? 
 

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటారు. నిజానికి ఇవి టేస్టీగా ఉండటమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. కోకో మొక్క విత్తనాల నుంచి తయారైన డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇలాంటి చాక్లెట్లను మధుమేహులు తినొచ్చా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు డార్క్ చాక్లెట్లను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే ఇవి ఇతర చాక్లెట్ల కంటే ఎంతో సురక్షితమైనవి. ఎందుకంటే వీటిలో కోకో ఉంటుంది. చక్కెర తక్కువగా ఉంటుంది. అలాగే పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. కానీ ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఏమాత్రం సహాయపడవు. అయితే మధుమేహులు వీటిని మితంగానే తినాలని ఆరోగ్య నిపుణులు సలహాస్తున్నారు. 
 


డార్క్ చాక్లెట్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఫైబర్ వంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా మితంగా తినడం వల్ల మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ లో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు వడదెబ్బ నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే ఇది చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 

రెగ్యులర్ మిల్క్ చాక్లెట్, ఇతర రకాల చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెటే మీకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చాక్లెట్ మీకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే మీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. అలాగే ఆరోగ్యకరమైన బరువు, స్థిరమైన బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
 

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్స్ అనే రెండు ముఖ్యమైన ఫైటోకెమికల్స్ ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి కణాలు, కణజాలాలపై ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

శరీరం ఇన్సులిన్ హార్మోన్ కు ప్రతిస్పందించడం లేదా ఉపయోగించడం ఆపేసినప్పుడు ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని బాగా పెంచుతుంది. ఇది ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది.

డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత, ఎండోథెలియల్ పనితీరు మెరుగుపడుతుందని ఒక అధ్యయనం నిరూపించింది. ప్రతిరోజూ కోకో నిండిన చిరుతిండిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.


పలు అధ్యయనాల ప్రకారం.. డార్క్ చాక్లెట్లను లిమిట్ లో తిన్నప్పుడు హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇది యాంటీథ్రోంబోటిక్, యాంటీహైపర్టెన్సివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సమస్యలను కూడా నివారిస్తుంది. ఇది రక్తం స్వేచ్ఛగా ప్రవహించడానికి సహాయపడుతుంది. 
 

Latest Videos

click me!