బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ను పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదకరమైన యువి కిరణాలు కంటిపై పడతాయి. దీంతో కంటి చూపు మందగించడం ప్రారంభవుతుంది. పోషకాల లోపం వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ సి, జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.