Beauty Tips: తెల్లని శరీర ఛాయ కలవారు.. మేకప్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు!

First Published | Oct 16, 2023, 5:32 PM IST

Beauty Tips: మేకప్ అనేది ముఖానికి ఎంత అవసరమో దానిని తగు జాగ్రత్త చర్యలు తీసుకొని వేయటం మరింత ముఖ్యం ఎందుకంటే మేకప్ లో ఏమైనా తేడా వస్తే ఉన్న అందం పాడైపోతుంది. అందుకే తెల్లని శరీర ఛాయ కలవారు మేకప్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
 

 మేకప్ వేసుకునే ముందు మనం ముందుగా అబ్జర్వ్ చేయవలసింది మన శరీర ఛాయ. రంగును బట్టి మేకప్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. లేనిపక్షంలో ఆ మేకప్ వికారంగా కనిపిస్తుంది. అందుకే తెల్లని శరీర ఛాయ కలవారు సహజ సిద్ధమైన అందాన్ని డిస్టర్బ్ చేయకుండా ఎలా మేకప్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 

మేకప్ వేసుకునేటప్పుడు ముందుగా మీరు పౌడర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది మీ మేకప్ ని పాన్ కేక్ లా కనిపించేలా చేస్తుంది. స్కిన్ కలర్ ఏదైనా ఫౌండేషన్ ని టెస్ట్ చేసి చర్మానికి మ్యాచ్ అయిన ఫౌండేషన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.


ఫెయిర్ స్కిన్ కలవారు స్ట్రాంగ్ అండర్ టోన్ లేని న్యూట్రల్ షేడ్ కలిగిన ఫౌండేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. అలాగే మీ తెల్లని చర్మానికి మీరు అందించగలిగే మొదటి రక్షణ వ్యవస్థ సన్ స్క్రీన్ లోషన్.

నాణ్యత కలిగిన సన్ స్క్రీన్ లోషన్ తీసుకొని మేకప్ ని వేసుకోవడానికి ముందు సన్నని కోట్ గా అప్లై చేయండి. ఇది మీ చర్మానికి ఫస్ట్ లేయర్ ప్రొడక్షన్ గా అందిస్తుంది. అలాగే మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తుంది.
 

అలాగే తెల్లని శరీర ఛాయ కలిగిన మహిళ కళ్ళు లైట్ కలర్ లో ఉన్నట్లయితే బ్లూ లేదా గ్రీన్ షెడ్ ఐ షాడో సూట్ అవుతుంది. ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళ కళ్ళు డార్క్ కలర్ లో ఉంటే బ్రౌన్, పర్పుల్ మరియు గ్రే కలర్ ఐ షాడో ను ఎంచుకోవాలి.
 

ఫెయిర్ స్కిన్ ఉన్నవారు లేత గోధుమ రంగు లేదా క్రీమ్ షేడ్ ఐషాడో లను ఎంచుకోకూడదు. అలాగే ఇలాంటి వాళ్ళకి కోరల్ షేడ్స్ తో పాటు చాకోలెట్ కలర్ లిప్స్టిక్లు సూట్ అవుతాయి. ఆరెంజ్, బ్రౌన్ వంటి కలర్లు అవాయిడ్ చేయటం మంచిది.

Latest Videos

click me!