గుడ్డు ఆరోగ్యానికే కాదు.. ముఖ సౌందర్యానికీ వెరీ గుడ్డే....

First Published Jul 15, 2021, 3:19 PM IST

గుడ్లలో ఉండే లుటిన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి.. చర్మానికి మంచి పోషకాలను అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. గుడ్డులోని తెల్లసొనలో సహజమైన ప్రోటీన్, అల్బుమిన్ ఉంటాయి. ఇది మీ చర్మాన్ని సాగిపోకుండా బిగుతుగా ఉండేలా సాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ ఏర్పడటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.

ప్రోటీన్ కు బెస్ట్ సోర్స్ ఏదీ ఉంటే తడుముకోకుండా చెప్పే సమాధానం ఎగ్ అని. దీంట్లో అసంతృప్త కొవ్వులు కూడా చాలానే ఉంటాయి. గుడ్లు ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకూ బాగా ఉపయోగపడుతుంది.
undefined
గుడ్లలో ఉండే లుటిన్ చర్మం సాగే గుణాన్ని తగ్గించి.. చర్మానికి మంచి పోషకాలను అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. గుడ్డులోని తెల్లసొనలో సహజమైన ప్రోటీన్, అల్బుమిన్ ఉంటాయి. ఇది మీ చర్మాన్ని సాగిపోకుండా బిగుతుగా ఉండేలా సాయపడుతుంది. బ్లాక్ హెడ్స్ ఏర్పడటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.
undefined
ఇక జుట్టుకు గుడ్డు చేసే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సహజమైన మెరిసే జుట్టుకోసం గుడ్డును తలకు పట్టించడం అమ్మమ్మల కాలంనుంచి వస్తున్నదే.
undefined
అయితే చర్మసౌందర్యానికి గుడ్లు చేసే లాభం ఏంటి? గుడ్లలోని పోషకాలు, ప్రోటీన్లు మీ చర్మాన్ని ఎలా ప్రకాశవంతం చేస్తాయి? ఎలా వాడితే అద్భుత ఫలితాలొస్తాయి? అని తెలుసుకోవాలంటే ఇవి చూడాల్సిందే..
undefined
చర్మ రంధ్రాలను బిగుతు చేసే మాస్క్ : కాస్త పెద్ద సైజ్ గుడ్డు తీసుకొని ఓ గాజు గిన్నెలో కొట్టండి. గుడ్డులోని పచ్చసొన నుండి తెల్లసొనను వేరు చేయండి. ఇప్పుడు తెల్లసొనలో 1.5 టీస్పూన్ల చక్కెర, 1 క్యాప్సూల్ విటమిన్ ఇ కట్ చేసి వేసి ఫోర్క్ లో బాగా కలపండి.
undefined
దీన్ని గిలకొడుతూ బాగా నురుగు వచ్చేలా చేయాలి. బాగా నురగ వచ్చాక ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అంతా అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత వెచ్చని వాష్‌క్లాత్ ఉపయోగించి దాన్ని తుడిచివేయండి. మరియు మీరు తక్షణం ఫలితం కనిపిస్తుంది. మచ్చలు లేని మెరిసే చర్మం కోసం వారానికి మూడుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే చాలు.
undefined
యాంటీ ఏజింగ్ మాస్క్ : ఇది కేవలం 2 పదార్థాలతో తయారుచేసే మామూలు మాస్క్. గుడ్డు పచ్చసొనలో టీ ట్రీ ఆయిల్ 2-3 చుక్కలు కలిసి.. మృదువైన పేస్ట్ లా అయ్యేవరకు ఫోర్క్ ఉపయోగించి గిలకొట్టాలి.
undefined
ఆ తరువాత మొహానికి అంతటికి సమానంగా పరుచుకునేలా చేతివేళ్లతో రుద్దాలి. సరిగా అంటకపోతే డబుల్ లేయర్‌ గా వేసుకోవాలి. తరువాత 20-30 నిమిషాలు అలాగే ఉంచండి.
undefined
ఇక ఈ మాస్క్ తొలగించే ముందు మీ ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసి, ఆ తరువాత చల్లని వాష్‌క్లాత్ ఉపయోగించి తుడవండి. మొటిమల సమస్యలకు చికిత్సగా కూడా ఈ మాస్క్ సహాయపడుతుంది.
undefined
మాయిశ్చరైజర్ మాస్క్ : ఒక గుడ్డు తీసుకొని తెల్లసొనను వేరుచేసి అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ వర్జిన్ కొకోనట్ ఆయిల్ వేసి వాటన్నింటినీ బాగా కలపండి.
undefined
బాగా నురుగు వచ్చేవరకు గిలకొట్టి.. దీన్ని ముఖం అంతటికీ సమానంగా అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత కడిగేయండి. ఈ మాస్క్ ను వారానికి 2-3 సార్లు చేయడం వల్ల చర్మం పూర్తిగా పొడిబారడాన్ని తగ్గించవచ్చు.
undefined
మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి వాడుతున్న ఖరీదైన ఉత్పత్తులన్నింటి కంటే గుడ్లు చాలా బెస్ట్. వాటన్నింటినీ విసిరేసి ఓ ట్రే గుడ్లు కొన్నారంటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం మీ సొంతమవుతుంది.
undefined
click me!