గుడ్డు సంపూర్ణ ఆహారం. అందుకే రోజూ ఒక గుడ్డును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు, డాక్టర్లు చెప్తారు. గుడ్లను ఆమ్లెట్లు, శాండ్విచ్లతో పాటుగా ఎన్నో వంటకాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి గుడ్డులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కానీ ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. నిజానికి గుడ్డు మన జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణలో భాగంగా గుడ్లను చేర్చుకుంటే మీ జుట్టును సిల్కీగా, అందంగా మెరుస్తుంది. ఇందుకోసం జుట్టుకు గుడ్లను ఎలా అప్లై చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..