ముల్లంగితో మస్తు ప్రయోజనాలు.. మీరు తింటున్నరా? లేదా?

First Published | Oct 8, 2023, 7:15 AM IST

ఇవీ అవీ అని కాకుండా కూరగాయలన్నీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఎందుకంటే కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కూరగాయల్లో ఒకటైన ముల్లంగిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇవి మనకు చేసే మేలు తెలిస్తే తినకుండా ఉండలేరు తెలుసా? 
 

మన శరీరం ఫిట్ గా ఉండాలంటే శారీరక శ్రమ చేయడంతో పాటుగా హెల్తీ ఫుడ్ ను తినాల్సి ఉంటుంది. ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లతో పాటుగా ఇతర హెల్తీ ఫుడ్ ను తింటే మనం ఆరోగ్యంగా, ఎన్నో రోగాలకు దూరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. నిజానికి ముల్లంగిని తినే వారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముల్లంగిని తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ముల్లంగిలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, అయోడిన్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలెన్నో ఉంటాయి. మరి ముల్లంగిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఫైబర్ కు గొప్ప మూలం

ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ముల్లంగిని తింటే గ్యాస్, మలబద్దకం సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు ముల్లంగి మన కాలెయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం ముల్లంగిని మన ఆహారంలో ఎన్నో విధాలుగా చేర్చుకోవచ్చు. దీన్ని కూడా సలాడ్ గా తినొచ్చు. లేదా కూరగాయల్లో వేయొచ్చు. 
 

Latest Videos


radish

గుండె ఆరోగ్యం 

మారుతున్న జీవన శైలి, చెడు ఆహారాలపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. మీకు గుండె జబ్బులు రావొద్దంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ముల్లంగి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఈ కూరగాయలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ -సి, ఫోలిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి.
 

హైబీపీ రోగులకు ప్రయోజనకరం

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాకలు దారితీస్తుంది. అయితే హైబీపీ పేషెంట్లకు ఒక ఔషదంలాగే పనిచేస్తుంది. ముల్లంగిలో  పొటాషియం తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. 

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం 

ముల్లంగిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ కూరగాయను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్రమం తప్పకుండా మీ ఆహారంలో ముల్లంగిని పరిమితంగా తింటే జలుబు, దగ్గు, ఇతర అంటువ్యాధులకు దూరంగా ఉంటారు. ముల్లంగి విటమిన్-సి లోపాన్ని పోగొట్టడానికి సహాయపడుతుంది.
 

చర్మానికి మేలు 

పోషకాలు పుష్కలంగా ఉండే ముల్లంగి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ముల్లంగి జ్యూస్ ను తాగితే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. దీనిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలు ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మొటిమలు, స్కిన్ డ్రై నెస్ వంటి చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. 

click me!