రాత్రిపూట లైట్ల చుట్టు పురుగులు చేరకూడదంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Oct 21, 2024, 1:22 PM IST

వర్షాకాలం, చలికాలంలో ఇంట్లోకి విపరీతంగా పురుగులు వస్తుంటాయి. ఈ పురుగులు ఇంట్లో ఉన్న లైట్ చుట్టూరా చేరుతుంటాయి. ఇవి ఫుడ్ పై పడటమే కాకుండా.. నిద్రపోయిన తర్వాత చెవుల్లోకి వెళతాయన్న భయం కూడా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బల్బుల దగ్గరికి ఒక్క పురుగు కూడా రాదు. 

లైట్ల చుట్టూ పురుగులు

వర్షాకాలం, వానాకాలంలో ఇండ్లలోకి విపరీతంగా దోమలు, రకరకాల పురుగులు వస్తుంటాయి. అది కూడా రాత్రిపూటే.  ముఖ్యంగా ఇవి లైటు దగ్గరికే వస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసింది. ఇక ఇంట్లోకి పురుగులు రాకూడదని తలుపులు, కిటికీలు మూసేస్తుంటారు. అయినా అవి చిన్న చిన్న రంధ్రాల గుండా కూడా లోపలికి వస్తుంటాయి. 

ముఖ్యంగా సాయంత్రం పూట అంటే చీకటి పడిన తర్వాత చిన్న చిన్న పురుగులు ఇంట్లోకి వచ్చి, లైట్లు, ట్యూబ్ లైట్ల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఈ పురుగులు నీళ్లలో, ఫుడ్ పై పడుతుంటాయి. అంతేకాకుండా చెవుల్లోకి కూడా వెళుతుంటాయి.

లైట్ల చుట్టూ పురుగులు

మీ ఇంట్లోకి కూడా  ఇలా లైట్ల చుట్టూ పురుగులు వస్తుంటే..చింతించాల్సిన పనిలేదు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ ఇంట్లోకి ఒక్క పురుగు కూడా రాదు. లైట్ల చుట్టూ పురుగులు చేరవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Latest Videos


లైట్ల చుట్టూ పురుగులు

లైట్ల చుట్టూ ఉన్న పురుగులను తరిమికొట్టే చిట్కాలు:

లవంగ నూనె

లవంగం నూనెతో కూడా ఇంట్లో బల్బుల చుట్టూ ఉన్న పురుగులను తరిమికొట్టొచ్చు. ఈ నూనె పురుగులను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో నీళ్లను తీసుకుని అందులో కొంచెం లవంగం నూనెను వేసి బాగా కలపండి. సాయంత్రం పూట ఈ వాటర్ ను ఇల్లు మొత్తం స్ప్రే చేయండి. దీంతో పురుగులు, దోమలు, ఈగలు ఒక్కటి లేకుండా పారిపోతాయి.

వేప నూనె

వేప నూనె కూడా ఇంట్లోకి ఒక్క పురుగును రానీయదు. ఈ వేపఆకుల్లోని చేదు వాసన పురుగులకు అస్సలు నచ్చదు. ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో నీళ్లు పోసి అందులో వేప నూనెను కలపండి. దీన్ని సాయంత్రం వేళ  ఇంటి అంతటా స్ప్రే చేయండి.  ఇది మీ  ఇంట్లోకి పురుగులను రాకుండా చేస్తుంది. 

లైట్ల చుట్టూ పురుగులు

బేకింగ్ సోడా & నిమ్మరసం

లైట్ల చుట్టూ పురుగులు చేరకుండా చేయడంలో బేకింగ్ సోడా నిమ్మరసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం నీళ్లను స్ప్రే బాటిల్‌లో పోసి దాంట్లో  బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి బాగా కలపండి. దీంతో ఇంటినంతా స్ప్రే చేస్తే ఇంట్లో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి. అలాగే బయటి పరుగులు ఇంట్లోకి అస్సలు రావు. 

లైట్ల చుట్టూ పురుగులు

ఇంట్లోకి పురుగులు రాకుండా చేసే ఇతర చిట్కాలు

1. తెల్ల లైట్ల చుట్టూ పురుగులు ఎక్కువ చేరుతాయి. కాబట్టి ఈ తెల్ల లైట్లకు బదులుగా పసుపు లైట్లను వాడండి. ఎందుకంటే పసుపు పచ్చని లైట్లపై పురుగులు తక్కువగా వాలతాయి. ఈ పురుగులు కళ్లు, నోరు, చెవులు, ముక్కులోకి వెళ్లకుండా రాత్రి పడుకునేటప్పుడు దోమతెరను ఖచ్చితంగా వాడండి.

2. పురుగుల బెడద తగ్గాలంటే అవసరం లేని గదుల్లో లైట్లను వేయకండి. దీంతో అక్కడికి పురుగులు రావు. అలాగే పురుగులను తరిమికొట్టడానికి మస్కిటో మ్యాట్ ను కూడా వాడండి. 

3. సాయంత్రం పూట కర్పూరాన్ని వెలిగించండి. దీని పొగను ఇంటినంతా వ్యాపింపజేయండి. పురుగులకు కర్పూరం పొగ వాసన అస్సలు నచ్చదు. ఈ కర్పూరం పొగ పురుగులను చంపుతుంది. అలాగే దోమలు ఇంట్లోకి రాకుండా చేస్తుంది. 

click me!