కొత్తిమీర, పూదీనాతో పాటుగా మనం చేసే ప్రతి కూరలో కరివేపాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూరను మంచి వాసన వచ్చేలా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అసలు ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు.
కరివేపాకును దక్షిణ భారతదేశంలో ప్రతి వంటలో ఉపయోగిస్తారు. నిజానికి కరివేపాకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. ఈ ఆకులు మనకు కడుపు సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.
కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. ఈ కరివేపాకులతో పొడి లేదా చట్నీ చేసుకుని కూడా తినొచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Benefits of drinking curry leaves water
జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది
కరివేపాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మీరు ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే మీ కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే మలబద్ధకం వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఇది మలబద్దకంతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కరివేపాకు వాటర్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈ నీటిని తాగితే మలబద్దకంతో పాటుగా అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం
కరివేపాకు నీళ్లను తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కరివేపాకు వాటర్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
benefits of Curry Leaves
చర్మానికి కూడా మేలు
కరివేపాకు వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అంటే ఇది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు గనుక ప్రతిరోజూ కరివేపాకు వాటర్ ను తాగితే మీ చర్మం కాంతివంతంగా, తేమగా ఉంటుంది. అంతేకాదు ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయం
బరువు తగ్గాలనుకునేవారికి కూడా కరివేపాకు వాటర్ బాగా సహాయపడుతుంది. ఈ నీటిని రోజూ తాగితే చాలా వరకు బరువు తగ్గుతారు. ఈ వాటర్ ను తాగితే మీ జీవక్రియ పెరుగుతుంది. ఈ వాటర్ ను తాగితే మీరు తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
చక్కెరను నియంత్రిస్తుంది
కరివేపాకు వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే కరివేపాకు వాటర్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అకస్మత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది.
జుట్టును బలపరుస్తుంది
కరివేపాకు వాటర్ ను తాగితే మీ జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. కరివేపాకులో ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టును బలంగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ వాటర్ ను రోజూ తాగితే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ జుట్టు షైనీగా ఉంటుంది. నల్లగా ఉంటుంది. పొడుగ్గా పెరుగుతుంది.