ఉదయం లేవగానే నోట్లో నుంచి వాసన ఎందుకొస్తుంది? ఇది పోవాలంటే ఏం చేయాలి?

First Published Oct 21, 2024, 12:16 PM IST

ఉదయం నిద్రలేవగానే చాలా మంది నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఎందుకు వాసన వస్తుంది? ఇది పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఉదయాన్నే చాలా మంది నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీనికి కారణం రాత్రి భోజనం కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. కానీ ప్రతిరోజూ ఇలాగే జరిగితే.. కొంతమంది నోట్లో నుంచి వచ్చే వాసనను పట్టించుకోకుండా బ్రష్ చేస్తుంటారు. కానీ ఇలా నోట్లో నుంచి ఎందుకు వాసన వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 

పొద్దున్నే నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటుంది.  అందులోనూ మనం నిద్రపోతున్నప్పుడు లాలాజలం ఉత్పత్తి  చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

లాలాజలం ఉత్పత్తి లేకపోవడం వల్ల రాత్రిపూట మీ నోరు ఎండిపోతుంది. దీనివల్ల నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. నోరు తెరిచి నిద్రపోతే ఈ సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

నోట్లో నుంచి శ్వాస తీసుకోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీనివల్ల మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే రాత్రిపూట నోరు పొడిబారడం చాలా సహజం. అయితే ఇదొక్కటే కాకుండా.. నోటి దుర్వాసనకు కారణమయ్యే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 

Latest Videos


bad breath

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?

బ్రష్ చేయండి:  మీరు నాలుకను బ్రష్ చేసిన తర్వాత కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటే.. రోజుకు ఒక్కసారైనా మౌత్ వాష్, ఫ్లోస్ ను వాడండి. అలాగే మీ నాలుకను ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి.

ఎందుకంటే మీ నాలుకపై దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. నోటి దుర్వాసన పోవాలంటే పళ్లు తోముకోవడంతో పాటుగా నాలుకను కూడా శుభ్రం చేసుకోండి. 
 

వాటర్ : మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. నీళ్లు తాగితే పొట్ట శుభ్రపడుతుంది. అలాగే లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది.

నోట్లో బ్యాక్టీరియా తగ్గుతుంది. దీనివల్ల మీ నోట్లో నుంచి దుర్వాసన వచ్చే అవకాశం తగ్గుతుంది. నోట్లో నుంచి దుర్వాసన రాకూడదంటే టీ, కాఫీ, సోడా, జ్యూస్ లేదా ఆల్కహాల్ వంటి పానీయాలకు దూరంగా ఉండండి. 

వీటిని తినండి: కొన్ని రకాల ఆహారాలను తిన్నా మీ నోట్లో నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. చక్కెర లేని మిఠాయిలను తినడం లేదా చక్కెర లేని గమ్ నమలడం వల్ల నోట్లో నుంచి రసాలు విడుదల అవడానికి సహాయపడుతుంది. 

నోటి ఇన్ఫెక్షన్లు:  నోటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎలాంటి నోటి ఇన్ఫెక్షన్ ఉన్నా.. వెంటనే చికిత్స తీసుకోండి.

నిజానికి సంక్రమణ వల్ల వాసన కలిగించే బ్యాక్టీరియా నాలుకపై త్వరగా పెరుగుతుంది. దీనివల్లే మీ నోట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్టైతే చికిత్స తీసుకుంటే దీని నుంచి బయటపడతారు. 

click me!