వంటగదిని శుభ్రంగా (Clean) ఉంచుకోవాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పోపుల డబ్బాలోని లవంగాలు, మిరియాలు, ఆవాలు, మెంతులు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇలా మొదలగు ద్రవ్యాలు ఆయుర్వేద పరంగా మనకు ఆరోగ్యాన్ని (Health) కలిగిస్తాయి. మనకు కలిగే చిన్న చిన్న రోగాలన్నింటినీ తొలగించడానికి సహాయపడుతాయి.
కనుక పోపుల డబ్బాను దివ్యౌషధంగా భావిస్తారు. కాబట్టి పోపుల పెట్టెను శుభ్రంగా ఉంచుకోవాలి. పోపుల పెట్టెలోనీ ద్రవ్యాలు పురుగులు (Worms) పట్టకుండా జాగ్రత్తపడాలి. పోపుల డబ్బాలోని సుగంధ ద్రవ్యాలకు (Spices) పురుగులు పడితే అష్టైశ్వర్యాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది.
అలాగే ముఖ్యంగా వంటగదిలో సింక్ ను శుభ్రంగా ఉంచుకోవాలి.
సింక్ జిడ్డుగా, జిగురుగా అయిపోయి సామాన్లతో నిండిపోయి ఉండరాదు. అదేవిధంగా స్టవ్, స్టవ్ వెనకవైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా (Unclean) ఉండరాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం (Grace) కలిగి దరిద్రం పడుతుంది. కాబట్టి స్టవ్, సింక్, గోడలను శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు గ్యాస్ సిలిండర్ల (Gas cylinder) మీద తేదీలు (Dates) రాస్తుంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెబుతారు. ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయడం అనేది ఐశ్వర్య క్షయం అని చెబుతారు. గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే ముఖ్యంగా బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు కనిపించకూడదు.
ఇవి వంట గదిలో కనిపిస్తే ఐశ్వర్యం మీకు ఉపయోగపడకుండా అనారోగ్యాలకు ఉపయోగపడుతుంది. కనుక అవి కనిపించకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వంట గదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత (Reciprocity) ఉండదు. ఎప్పుడూ గొడవలు (Conflicts) జరుగుతాయి.
అలాగే పాడైపోయిన లైటర్ (Damaged lighter) లను వంటగదిలో ఉంచకూడదు. అదేవిధంగా ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి. ఉదయం వరకూ అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. కనుక ఇలా చిన్న చిన్న జాగ్రత్తలను (Minor precautions) పాటిస్తూ వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.