Stress management: ఆఫీసులో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఇలా చేయండి!

Published : Feb 01, 2025, 04:51 PM IST

రకరకాల షిష్ట్ లు, బిజీ షెడ్యూల్, వర్క్ లోడ్ కారణంగా చాలా మంది ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతుంటారు. ప్రతి దానికి టెన్షన్ పడిపోతుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిదికాదు. మరి ఒత్తిడిని తగ్గించుకొని.. మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
Stress management: ఆఫీసులో ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే ఇలా చేయండి!

సాధారణంగా మన జీవితంలో జరిగే చాలా విషయాల వల్ల మనం ఒత్తిడికి లోనవుతుంటాం. కానీ ఎక్కువశాతం స్ట్రెస్ ఫీలయ్యేది మాత్రం వర్క్ ప్లేస్ లోనే. చాలా మంది ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతుంటారు. అక్కడ అవకాశాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు పెరిగే కొద్ది ఒత్తిడి పెరిగిపోతుంటుంది. శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒత్తిడికి కారణమవుతుంది.

25
ఆఫీసులో ఒత్తిడి:

ఆఫీసులో ఒత్తిడి, అలసట, టెన్షన్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆఫీసులో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

35
ఇలా చేస్తే ఒత్తిడి దూరం:

బాగా నిద్రపోండి:

రోజుకి 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. కానీ ఒత్తిడిగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రి బాగా నిద్రపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట మొబైల్ చూడకపోవడం మంచిది.

పోషకాలున్న ఆహారం తీసుకోండి:

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. మనసుని ఆరోగ్యంగా ఉంచుతాయి.

45
వ్యాయామం చేయండి:

వ్యాయామం మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం 20 నిమిషాలు నడిచిన ఒత్తిడి, టెన్షన్ తగ్గుతాయి.

ధ్యానం చేయండి:

ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. ధ్యానం మనసుని ఏకాగ్రతతో ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను కల్పిస్తుంది.

55
పరిమితులు పెట్టుకోండి:

చాలా మంది 24 గంటలు ఆఫీసు గురించే ఆలోచిస్తుంటారు. దాంతో ఒత్తిడి బాగా పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి పరిమితులు పెట్టుకోవాలి. ఒక టైం లోపలే పని పూర్తి చేయాలి. తర్వాత మన కోసం మనం సమయం కేటాయించాలి. అప్పుడు మరుసటి రోజు ఉత్సాహంగా పనిచేయగలం.

ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి:

ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైతే ఇంట్లో వాళ్ళతో, స్నేహితులతో మాట్లాడండి. దాంతో ఒత్తిడి తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories