Furniture: ఎంతో ముచ్చటపడి వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుక్కునే ఫర్నిచర్‌కు చెదలు పడితే…వచ్చే బాధ అంతా ఇంతా కాదు. కంటికి కనిపించకుండానే అందమైన కుర్చీలు, మంచాలను గుల్ల చేసేస్తాయి. మరి ఈ చెదలు అస్సలు పట్టకుండా, మీ ఇంట్లో పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మంచాలు, బీరువాలకు ఈ స్ప్రే ఒక్కటి కొడితే చాలు ఎప్పటికీ చెదలే పట్టవు
ఇల్లు అందంగా కనిపించాలని ఇష్టపడి, వేలకు వేలు ఖర్చు చేసి నచ్చిన ఫర్నిచర్ కొనుక్కుంటాం. కానీ, మనకు తెలియకుండానే చెదలు సైలెంట్ కిల్లర్‍లా మారి ఆ ఖరీదైన సోఫాలు, మంచాలు, కుర్చీలను కొద్ది రోజుల్లోనే గుల్లగుల్ల చేసేస్తాయి. ఫర్నిచర్ పూర్తిగా పాడైపోయే వరకు చాలా మంది అసలు చెదలు పట్టిన విషయాన్నే గమనించలేరు. మరి మీ ఇంట్లోని కాస్ట్లీకబోర్డులు, కీటికీలు, బీరువాలు, సోఫాలను ఈ చెదల బారి నుంచి ఎలా కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
28
చెదలకు ఇంటి చిట్కాలు
వైట్ వెనిగర్ చెదలను తరిమికొడుతుంది. రెండు నిమ్మకాయల రసంలో ఒక కప్పు వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి, చెదలు ఉన్న చోట స్ప్రే చేయండి. దీనిలోని ఆమ్ల గుణం వల్ల చెదలు పారిపోతాయి. తరచూ వాడితే ఫలితం కనిపిస్తుంది.
38
కిరోసిన్ వాడకం
చెదలు పట్టినచోట, చీమలు పట్టినచోట కిరోసిన్ వేసినా చెదలు చచ్చిపోతాయి. ఇది వాడినా ఫలితం ఉంటుంది. కాకపోతే అక్కడ మంట తగలకుండా చూసుకోవాలి. లేదంటే భగ్గుమనే ప్రమాదం ఉంది.
చెదలను చంపడానికి బోరిక్ యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే బోరిక్ యాసిడ్ పౌడర్‌ను నీటిలో కలిపి చిక్కటి ద్రావణంలా తయారుచేయండి. ఈ ద్రావణాన్ని చెదలు పట్టిన చోట స్ప్రే చేయండి లేదా బ్రష్‌తో రాయండి. బోరిక్ యాసిడ్ చెదలను నియంత్రిస్తుంది, కానీ ఇది పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి. వారి ప్రాణానికి ప్రమాదం. కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి.
58
ఉప్పు నీటి స్ప్రే
ఇది చాలా చవకైన, సులభమైన చిట్కా. వేడి నీటిలో ఉప్పు వేసి, అది పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక సిరంజ్‌లోకి తీసుకుని చెదలు పట్టిన రంధ్రాలలోకి ఇంజెక్ట్ చేయండి. లేదా చెదలు కనిపించే చోట స్ప్రే చేయవచ్చు. చెదలు పరార్.
68
వేప నూనె
వేప నూనెకు కీటకాలను తరిమికొట్టే శక్తి ఉంది. చెదలు కనిపించే ప్రదేశంలో స్వచ్ఛమైన వేప నూనెను స్ప్రే చేయండి. దీంతో చెదలు పారిపోతాయి. వేప నూనె ఫర్నిచర్‌కు ఎలాంటి హాని చేయదు, ఇది పూర్తిగా సురక్షితం. దూది సహాయంతో కూడా వేప నూనెను అప్లై చేయవచ్చు.
78
ఈ విషయం గుర్తుంచుకోండి
చెదలు తక్కువగా ఉన్నప్పుడే ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కానీ సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఇంట్లో తేమ, చెక్క వస్తువులు, గాలి సరిగా ఆడకపోవడం వంటివి చెదలు పట్టడానికి ముఖ్య కారణాలు. తడి ఉన్న ప్రదేశాల్లో చెదలు ఎక్కువగా పెరుగుతాయి.
88
ఇలా రక్షించుకోండి
చెక్క ఫర్నిచర్‌ను ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచండి. తేమ తగలకుండా చూసుకోండి. వీలైనప్పుడు ఫర్నిచర్‌ను ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల చెదలు పట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.