Pudina: పుదీనాను ఇలా తింటే త్వరగా బరువు తగ్గొచ్చు, నెల రోజులు ప్రయత్నించి చూడండి

Published : Nov 26, 2025, 10:52 AM IST

Pudina: పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారు పుదీనాను తినడం లేదా తాగడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. పుదీనా ఎలా వాడితే బరువు తగ్గుతారో తెలుసుకోండి. 

PREV
15
బరువు తగ్గించే పుదీనా

పుదీనాతో సులువుగా బరువు తగ్గవచ్చు. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. ఎవరికైతే కడుపులో ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు ఉంటాయో వారు పుదీనా తినడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. జీర్ణ శక్తి బలంగా ఉంటేనే బరువు తగ్గడం సులువవుతుంది. బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్లు, హెర్బల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారా? వేగంగా బరువు తగ్గేందుకు పుదీనా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.

25
Mint Leaves for Weight Loss

పుదీనాలో ఉన్న మెంటాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది మెటాబాలిజం రేటును పెంచుతుంది. దీనివల్ల శరీరం క్యాలరీలను కొంచెం త్వరగా ఖర్చు చేస్తుంది. అలాగే పుదీనా వాసన, రుచి అనేవి ఆకలిని తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయి. ఎక్కువగా తినాలన్న భావన తగ్గితే మీరు తినే ఆహారం తగ్గుతుంది. ఇది బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. పుదీనాను ఎలా తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చో తెలుసుకోండి.

35
పుదీనాతో ఆరోగ్యం

పుదీనా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  ఆకలిని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఈ ఆకుల్లో కేలరీలు, కొవ్వులు తక్కువ. దీన్ని రోజూ ఆహారంలో లేదా పానీయంగా తీసుకుంటే కేలరీలు తగ్గుతాయి.

45
ఇలా తినండి

పుదీనాను కషాయంలా తయారుచేసుకుని తాగితే ఎంతో మంచిది. దీనికోసం కొన్ని తాజా పుదీనా ఆకులు తీసుకోండి. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి, కడిగిన పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. తరువాత దాన్ని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. దీన్ని రోజూ ఉదయం పరగడుపున తాగితే బరువు త్వరగా తగ్గుతారు.

తాజా పుదీనా ఆకుల్ని కడిగి పచ్చిగా నమిలితే ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసనను పొగొడుతుంది.  బరువును కూడా తగ్గిస్తుంది.

55
పుదీనా టీ

పుదీనా టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత ఇందులో పుదీనా ఆకులు వేసి కొద్దిగా మరిగించి స్టవ్ ఆపాలి. కొన్ని నిమిషాల తర్వాత వడగట్టి  తేనె లేదా పటిక బెల్లం వేసి కలపండి. కావాలంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అంటే పుదీనా టీ సిద్ధమైనట్టే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని పరగడుపున ఈ టీ తాగితే అన్ని విధాలా మంచిది. 

పుదీనా చట్నీ కూడా బరువును తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్ని మిక్సీ జార్‌లో వేసి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, చిన్న ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బాలి. తర్వాత ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టాలి. అంతే, పుదీనా చట్నీ రెడీ.

Read more Photos on
click me!

Recommended Stories