Kiwi: కివీని ఎలా తింటున్నారు? ఇలా మాత్రం తినకండి, నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Published : Sep 29, 2026, 01:18 PM IST

Kiwi: కివీ తింటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ తో అందులోని పోషకాలను మిస్ అవుతున్నారని తెలుసా? చాలా మంది తొక్క తీసేసి తింటారు. కానీ కివీ పండును తినే విధానం తెలిస్తేనే పోషకాలు దొరుకుతాయి.

PREV
14
కివీని ఎలా తింటున్నారు?

కివీ పండు తినేటప్పుడు చాలామంది లోపల ఉన్నది మాత్రమే తింటారు. తొక్కను తీసేసి పారేస్తారు. కానీ న్యూట్రిషనిస్టుల ప్రకారం.. కివీని ఎలా తింటున్నామన్నది కూడా దాని నుంచి లభించే పోషకాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తొక్కతో తినడం వల్ల ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరింత ఎక్కువగా లభించే అవకాశం ఉంది.

24
కివీని తొక్కతో తినాలా?

కివీని తొక్క తీసేసి తినడం వల్ల పండులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కోల్పోతాం. ముఖ్యంగా గ్రీన్ కివీ తొక్కలో కూడా ఫైబర్, పాలీఫినాల్స్ వంటి పోషకాలు ఉంటాయి. గ్రీన్ కివీని తొక్కతో తింటే.. రెండింతలు ఫైబర్, ఐదు రెట్లు ఎక్కువ పాలీఫినాల్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడటంతో పాటు, పేగుల పనితీరుకు కూడా తోడ్పడవచ్చు.

అయితే గ్రీన్ కివీ తొక్కపై ఉండే చిన్న చిన్న వెంట్రుకల్లాంటి పొర చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ముందుగా కివీని నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రమైన కిచెన్ టవల్‌తో మెల్లగా రుద్దితే అవి పోతాయి. అప్పుడు పలుచని ముక్కలుగా కోసుకుని తొక్కతో సహా తినొచ్చు.

34
గోల్డెన్ కివీ

గోల్డెన్ కివీ తొక్క గ్రీన్ కివీతో పోలిస్తే పలుచగా, మృదువుగా ఉంటుంది. అంతేకాదు.. దానిపై వెంట్రుకల్లాంటివి తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని తొక్క తీయకుండా నేరుగా తినడం ఈజీ. గోల్డెన్ కివీని తొక్కతో తింటే.. 50 శాతం ఎక్కువ ఫైబర్, 32 శాతం ఎక్కువ విటమిన్-ఈ, 34 శాతం ఎక్కువ ఫోలేట్ దొరుకుతుంది.

44
రోజుకు ఎన్ని కివీలు తినొచ్చు?

కివీని ఎంత తినాలనే విషయంలో ఒక విధానం ఉంటుంది. రోజుకు రెండు కివీలు చొప్పున నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల కొంతమందిలో పేగులు క్లీన్ అవుతాయి. జీర్ణవ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది.

184 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో.. కొందరికి ప్రతిరోజూ రెండు కివీలు ఇవ్వగా, మరికొందరికి సైలియం హస్క్ ఇచ్చారు. నాలుగు వారాల తర్వాత కివీలు తీసుకున్నవారిలో మల విసర్జన సాఫీగా, మలం సులభంగా బయటకు వెళ్లడం, జీర్ణక్రియ మెరుగుపడటం కనిపించింది. కివీలో కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా కరిగే ఫైబర్, ప్రీబయోటిక్ ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఉపయోగపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories