Figs For Bones: అంజీర పండుతో ఎముకలు బలంగా మారడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

Published : May 05, 2022, 11:25 AM IST

Figs For Bones: అంజీర పండును తినడం వల్ల ఎముకలు బలంగా మారడమే కాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. 

PREV
110
Figs For Bones: అంజీర పండుతో ఎముకలు బలంగా మారడమే కాదు..  మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

Figs For Bones: బలహీన ఎముకలను బలంగా చేయడానికి అంజీర పండ్లు ఎంతో సహాయపడతాయి. అత్తిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు వీటిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అయితే వీటిని ఎలా తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 
 

210

అత్తి పండ్లను నానబెట్టుకుని తినాలి.. బాగా నానబెట్టిన అంజీర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నేరుగా తినే బదులుగా నానబెట్టుకుని తింటే మరిన్ని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువ సేపు నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

310


నానబెట్టిన అంజీరను తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు.. 

బాగా నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఎముకలు బలంగా, ధ్రుడంగా తయారవుతాయి. ఎవరైతే బలహీనమైన ఎముకలతో బాధపడుతున్నారో వారు నానబెట్టిన అత్తిపండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. 
 

410

నానబెట్టిన అంజీర పండ్లను తింటే మన గుండె ఆరోగ్యానికి చాలా మందిది. వాస్తవానికి వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీకు గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

510

దీనితో పాటుగా నానబెట్టిన అంజీర జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎన్నో సమస్యలను తొలగిస్తుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది.

610

అంతేకాదు ఈ పండును రక్తహీనత లోపానికి కూడా చెక్ పెడుతుంది. రక్తం తక్కువగా ఉండే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చక్కటి ఫలితం పొందవచ్చంటున్నారు  ఆరోగ్య నిపుణులు. 

710

అంజీర పండు గర్భిణులకు ఎంతో అవసరం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కడుపులో పెరుగుతున్న పిండం ఎదుగుదలకు, ఎముకలను బలంగా ఉంచడానికి ఎంత సహాయపడతాయి. అందుకే గర్భిణులు ఖచ్చితంగా తినాల్సిన పండులో అంజీరను చేర్చారు. 
 

810

మలబద్దకం సమస్య పోతుంది.. అంజీరలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం సమస్యను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. దీనిని అల్పాహారంలో సలాడ్ రూపంలో తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 
 

910

బరువు తగ్గుతారు.. అత్తిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగానే ఉంచుతుంది. దీంతో మీరు ఫుడ్ ను మోతాదుకు మించి అస్సలు తీసుకోలేరు. దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు అంజీర బెస్ట్ డైట్ ఫుడ్.  

1010

కండ్ల ఆరోగ్యానికి.. ఈ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఈ పండును తరచుగా తినడం వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయి. 

click me!

Recommended Stories