Potato Side Effects: వామ్మో బంగాళాదుంపలను ఎక్కువగా తింటే ఇంత డేంజరా..?

Published : May 05, 2022, 10:37 AM IST

Potato Side Effects: బంగాళాదుంప కూరగాయల్లో రారాజుగా గుర్తింపు పొందింది. అందులోనూ ఆలు ఏ కూరగాయల్లో వేసుకుని తిన్నా బలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది బంగాళాదుంపలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
16
Potato Side Effects: వామ్మో బంగాళాదుంపలను ఎక్కువగా తింటే ఇంత డేంజరా..?

Potato Side Effects: ఆలు కర్రీ, ఆలు ఫ్రై, ఆలు చిప్స్ ఇలా.. ఆలుతో ఏది వండుకుని తిన్నా బలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మందికి ఆలు ఫేవరెట్ కర్రీ. అయితే ఆలును మోతాదుకు మించి తింటే మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలును వారంలో ఎక్కువ సార్లు తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.

26

అలెర్జీ బారిన పడతారు.. వారంలో ఎక్కువ సార్లు బంగాళాదుంపను తినడం వల్ల మీరు అలెర్జీ బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

36

ఆర్థరైటిస్ రోగులకు ప్రమాదకరం.. బంగాళాదుంపలతో చేసిన వంటలు టేస్టీగా ఉన్నప్పటికీ వీటిని ఎక్కువ సార్లు తినడం వల్ల కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే ఆర్థరైటిస్ రోగులు బంగాళాదుంపలను మోతాదులోనే తీసుకోవడం మంచిది. 
 

46

మధుమేహులు వీటికి దూరంగా ఉండాలి.. డయాబెటీస్ పేషెంట్లు బంగాళాదంపలను ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇవి వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే మధుమేహులు ఆలుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

56

రక్తపోటును పెంచుతాయి.. బంగాళాదుంపలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటు పేషెంట్లు బంగాళాదుంపలను ఎక్కువ మొత్తంలో అస్సలు తీసుకోకూడదు. 

66

బరువు పెరుగుతారు.. బంగాళాదుంపలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆలులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేలరీలను పెంచడానికి సహాయపడతాయి. ఇదికాస్త ఊబకాయానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

click me!

Recommended Stories