మామిడి పండు తింటే బరువు పెరుగుతారనడంలో నిజమెంతుంది? దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవిగో..

Published : May 05, 2022, 09:57 AM IST

Mangoes for weight loss: పండ్లలో రారాజైన మామిడి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పండును తింటే ఒంట్లో వేడి పెరుగుతుంది. అలాగే  బరువు కూడా బాగా పెరుగుతారని.. అందుకే ఈ పండును తినకూడదని చెబుతుంటారు. అయితే పండుపై ఉన్న అపోహలు, వాస్తవాలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
113
మామిడి పండు తింటే బరువు పెరుగుతారనడంలో నిజమెంతుంది? దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవిగో..

Mangoes for weight loss: పండల్లలో రారాజైన మామిడి పండును తినడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండేరేమో. ఎంత తినాలని ఇష్టం ఉన్నా.. కొంతమంది మాత్రం వీటిని అస్సలు తినరు. ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుందని, బరువు పెరిగిపోతారంటూ వీటిని పరిమితిలోనే తినాలని చెబుతుంటారు. 

213
mangoes

మార్కెట్లలో వివిధ పండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో మన దేశంలో 15 రకాల మామిడి పండ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. తోతాపురి, హవుస్, సింధూర, రత్నగిరి, చౌసా, రస్పురి, పైరి, హిమ్సాగర్, నీలం,, మల్గోవా, మాల్టా, లంగ్రా, కేసర్, బాదామి పండ్లు బాగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. 

313

ఈ మామిడి పండ్లు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. కానీ వీటిని తినాలని ఇష్టం ఉన్నా.. తినడానికి వెనకాడేవారు చాలా మందే ఉన్నారు. వీటిని తింటే అనారోగ్యం పాలవుతామేమోనని అపోహ పడిపోతుంటారు. నిజానికి మామిడి పండు మీ ఆరోగ్యంపై ఎలాంటి హానికరమైన ప్రభావాన్ని చూపదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

413
mango

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. మామిడిపండులో బరువును తగ్గించే గుణాలుంటాయని కొందరు అంటుంటే.. మరికొందరేమో దీన్ని తింటే బరువు  పెరిగిపోతారని హెచ్చరిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు 100 కిలో కేలరీల తాజా మామిడి పండ్లను తిన్న 27 మందిపై పరిశోధన చేశారు. వీరిలో రక్తంలో గ్లూకోజ్, సి రియాక్టీవ్ ప్రోటీన్ (సిఆర్పీ), aspartate transaminase యాక్టివిటీ, యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదలను గుర్తించారు. 

513

మామిడి పండ్లను తిన్న తర్వాత శరీర బరువు, ఒంట్లో కొవ్వు శాతం, రక్తపోటు, ఇన్సులిన్ లేదా లిపిడ్ ప్రొఫైల్ లో పెద్ద మార్పులు ఏమీ లేవు అని ‘అధిక బరువు మరియు ఊబకాయం ఉన్నపెద్దలతో కార్డియోమోటాబోలిక్ ప్రమాద కారకాలపై తాజా మామిడి వినియోగం యొక్క ప్రభావాలు’ అనే శీర్షికతో చేసిన అధ్యయనం లో వెళ్లడైంది.

613

కార్బ్ లోడ్ చేసిన మామిడి పండ్లను తినడం వల్లే అధిక కేలరీలు, బరువు పెరగడానికి దారితీస్తుందన్న కారణంతో ఈ మామిడి పండ్లను తినకూడదని ఇంకొంత మంది నిపుణులు మామిడి పండ్లను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

713
Mangoes

మామిడిపండ్లు మొటిమలకు కారణమవుతాయా..? ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మంచి పోషకాహారం. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, రాగి వంటివి పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు మొటిమలను ప్రేరేపిస్తాయనడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. 

813

డయాబెటీస్ పేషెంట్లు మామిడిపండ్లను తినకూడదా..? మధుమేహులు మామిడి పండ్లను మితంగా తింటే ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది వైద్యులు మధుమేహులు మామిడి పండ్లను అస్సలు తినకూడదని హెచ్చరిస్తుంటారు. దీనికి కారణం మామిడి పండులో ఉండే గ్లైసెమికి్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుందని. అయితే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 ఉంటుంది. ఇది ఇతర ఆహారాలతో పోల్చితే చాలా తక్కువ. డయాబెటీస్ పేషెంట్లు గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

913
mangoes

మామిడిపండ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయా..? నిజానికి మామిడి పండ్లు శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇది చలువ చేసే పండ్లు కావు. అందుకే వీటిని తినేటప్పుడు కాసేపు నీటిలో నానబెట్టుకుని తినాలి. 

1013

మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. మామిడి పండ్లు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. అంతేకాదు దీనిలో ఉండే మాంగిఫెరిన్ సమ్మేళనం గుండె వాపును తగ్గిస్తుంది. 

1113
mangoes

మామిడి పండ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి.. మామిడి పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు మలబద్దకం సమస్యతో బాధపడేవారికి చక్కటి ఔషదంలా పనిచేస్తాయి. ఇందులో ఉంటే అలైలేస్ సమ్మేళనాలు, పిండి పదార్థాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. 

1213

రోజుకు ఎన్ని మామిడి పండ్లను తినాలి..? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు రెండు కప్పులు లేదా 350 గ్రాముల కంటే తక్కువగానే తినాలని చెబుతున్నారు. 100 గ్రాముల పండులో 60 కేలరీలు ఉంటాయి. మొత్తం మామిడి పండులో 202 కేలరీలు ఉంటాయి. 

1313

మామిడిలో ప్రోటీన్లు, కేలరీలు, పిండి పదార్థాలు, కొవ్వు, ఫైబర్, చక్కెర, విటమిన్ సి, రాగి, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్ ఎ, విటమిన్ కె, నియాసిస్, పొటాషియం, రిబోప్లేవిన్, మెగ్నీషియం, థయాకమిన్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

click me!

Recommended Stories