డబ్బు సంపాదించడానికి ఈజీ మార్గం ఇది

First Published | Nov 9, 2024, 2:50 PM IST

డబ్బు బాగా సంపాదించాలని, లైఫ్ లో ధనవంతులు అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అది చాలా కష్టమైన పని, సాధ్యం కాని విషయం అని భయపడుతూ ఉంటారు. కానీ, సరైన ఆర్థిక అవగాహన, పెట్టుబడి పెట్టే సామర్థ్యం, కాస్త తెలివి ఉంటే ఈజీగా ధనవంతులు కావచ్చు.  డబ్బు ఈజీగా సంపాదించగల కొన్ని సులువైన మార్గాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బు సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ , ధనవంతులు అవ్వడం అంత సులవైన పని కాదు అని వారు భావిస్తారు. కాస్త కొంచెం ఆర్థిక అవగాహణ, పెట్టుబడి పెట్టగల సత్తా ఉంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. సంపాదించిన డబ్బు దాచుకుంటే ధనవంతులు కాలేరు. సరైన నిర్ణయాలు తీసుకొని మంచి పెట్టుబడి పెడితేనే ధనవంతులు కాగలరు. మరి, ఈజీగా ధనవంతులు గా మారే కొన్ని మార్గాలు ఇప్పుడు చూద్దాం..

ఈక్విటీలో పెట్టుబడులు

ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. అయితే.. ఎప్పుడుపడితే ీఅప్పుడు పెడితే నష్టపోతారు. మార్కెట్ సమయం కాకుండా.. దీర్ఘకాలిక లక్ష్యాలు, కాస్త రిస్క్ చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు మంచి లాభాలు పొందుతారు.


ఒకే బుట్టలో అన్ని గుడ్లు వద్దు

ఒకే చోట అన్ని పెట్టుబడులు పెట్టకూడదు. ఈక్విటీ త్వరగా డబ్బు ఇస్తుందని అక్కడే అంతా పెట్టడం మంచిది కాదు. ఈక్విటీతో పాటు రియల్‌ ఎస్టేట్‌, బంగారం, వెండిలో కూడా పెట్టుబడి పెట్టాలి.

అత్యవసర నిధి ఉండాలి

అత్యవసర నిధి మీ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. దీర్ఘకాలిక అవసరాల కోసం పెట్టుబడులకు అడ్డురాకుండా ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో లిక్విడ్ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడిని సులభంగా ఉపసంహరించుకోవచ్చు.
 

ఖచ్చితమైన రాబడి ఇచ్చేవి

స్థిర ఆదాయ పెట్టుబడులు మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాలి. ఇవి ఖచ్చితమైన రాబడిని ఇస్తాయి. దీనివల్ల రిస్క్, రాబడిని సమతుల్యం చేసుకోవచ్చు.
 

ఇపిఎఫ్‌లో పెట్టుబడి పెట్టండి

ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) భారత ప్రభుత్వం నిర్వహించే పదవీ విరమణ పొదుపు పథకం. ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి.
 

లైఫ్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌

భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేం. కుటుంబం సురక్షితంగా ఉండాలంటే జీవిత బీమా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అవసరం. ఇవి ఉంటే భవిష్యత్తు గురించి ఆందోళన అక్కర్లేదు.

ఖర్చులు నియంత్రించుకోండి

వ్యక్తిగత విజయంలాగే ఆర్థిక విజయంపైనా శ్రద్ధ ఉండాలి. ఎక్కడ తప్పులు చేశారో, ఎక్కువ డబ్బు సంపాదించడం, దాచుకోవడం, పెట్టుబడి పెట్టడం ఎలాగో తెలుసుకోవడం సులభం అవుతుంది. 

ఆర్థిక లక్ష్యాలు ఏర్పరుచుకోండి

ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టే విధానం వేరు. ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
 

ఆర్థిక స్వాతంత్య్ర కాంక్ష

ఆర్థిక స్వాతంత్య్రం కావాలనే కోరిక ఎక్కువ ఆదాయం సంపాదించడానికి దోహదపడుతుంది. అనవసర ఖర్చులు, అప్పులు చేయకూడదు. త్వరగా అప్పులు తీర్చేయాలి.

నష్టాలకు భయపడకండి

పెట్టుబడి అంటే లాభనష్టాలు ఉంటాయి. అనవసర ఖర్చులు, నష్టాలు వచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టకండి. అప్పులు, కారు, బైక్‌, ఖరీదైన వస్తువులు కొనడంలో పరిమితి పాటించాలి. ఈఎంఐలతో కొనకండి. అనవసరమైన వస్తువులు కొనొద్దు.
 

Latest Videos

click me!