కరివేపాకును చెట్టు నుంచి కోసిన రెండు మూడు రోజులకే ఆకులు ఎండిపోవడం మొదలవుతుంది. అయితే చాలా మంది కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయినా ఆకులు ఎండిపోతాయి. అయితే మీరో ఒక సింపుల్ పద్దతిని ఫాలో అయితే మాత్రం కరివేపాకు ఒక ఆరు నెలల వరకు ఫ్రెష్ గా, అప్పుడే కోసిన దానిలా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
curry leaves
ముందుగా మీరు తెచ్చిన కరివేపాకును దుమ్ము, ధూళి లేకుండా ఒకటికి రెండు సార్లు నీళ్లలో వేసి బాగా కడగండి. వీటిని కడిగిన తర్వాత కాండం నుంచి ఆకుల వరకు నీటి తేమ లేకుండా బాగా ఆరనివ్వండి.
ఆరిన కరివేపాకును తెంచి ఐస్ క్యూబ్ ట్రేలో వేయండి. అన్నీ ఐస్ క్యూబ్స్ ట్రేలను కరివేపాకుతో నింపి వాటిలో నీళ్లు పోయండి. ఈ ట్రేలను 3 నుంచి 4 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. ఐస్ క్యూబ్స్ రెడీ అయిన తర్వాత వీటిని ట్రే నుంచి బయటకు తీసి జిప్ లాక్ జేబులో పెట్టి మళ్లీ ఫ్రీజ్ చేయండి.
6 నెలలు ఆదా
మీరు గనుక కరివేపాకును ఇలా నిల్వ చేస్తే.. కాదనకుండా.. ఒక ఆరు నెలలలైనా కరివేపాకు తాజాగా ఉంటుంది. అస్సలు పాడుకాదు. ఇకపోతే మీరు కరివేపాకును ఉపయోగించే ముందు ఐస్ క్యూబ్స్ ను నీటిలో కరిగించి తర్వాత కరివేపాకును ఆరబెట్టి కూరలో వేయండి.