భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ సైన్స్ ప్రకారం.. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ అలవాటు వల్ల మీకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అసలు తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణక్రియకు ఆటంకం
ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మీకు అలసట, నిద్రలేమి, అలసటతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే తిన్న వెంటనే పడుకోకూడదు.
నెమ్మదిగా జీర్ణం
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మీరు తిన్నది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అందుకే తిన్న వెంటనే నిద్రపోకూడదని పెద్దలు చెప్తారు. .
నిద్రకు భంగం
తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మీకు సరిగ్గా నిద్రరాదు. ఇది మీ దినచర్యకు భంగం కలిగిస్తుంది. అలాగే ఈ అలవాటు బీపీని కూడా పెంచుతుంది.
పీడకలలు
మీరు తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల పీడకలలు పడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ కారణంగానే పగటిపూట తిన్న వెంటనే నిద్రపోకూడదని, తిన్న తర్వాత కాసేపు నడవాలని చెప్తుంటారు.
జీవక్రియ ప్రభావితం
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మీ మెటబాలిజం బలహీనపడుతుంది. దీనివల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం, స్థూలకాయం వంటి వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
sleep
ఎసిడిటీ
అవును తిన్న వెంటనే నిద్రపోతే మీ జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల మీకు ఎసిడిటీ సమస్య వస్తుంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి.
బరువు పెరగడం
భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అవును భోజనం చేసిన వెంటనే మీరు పడుకోవడం వల్ల ఫ్యాట్స్ పెరిగిపోతాయి. మీరు బరువు పెరిగితే ఎన్నో ఇతర రోగాల బారిన పడాల్సి వస్తుంది.