
అధిక బరువు, ఊబకాయం సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణంగా మారాయి. భారతదేశంలో సుమారు మూడు కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ వల్ల సర్వ రోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఊబకాయం వల్ల అర్థాంతరంగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే చాలా మంది తమ బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ బిజీ లైఫ్ కారణంగా వాటిని సరిగ్గా ఫాలో కాలేకపోతున్నారు. ముఖ్యంగా వర్క్ చేసేవారైతే ప్రతిరోజూ వ్యాయామం చేయడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారు డైట్ ను ఫాలో అయితే ఎలాంటి సమస్యా రాదు. ఈ డైట్ లో నీళ్లు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే నీళ్లే బరువును తగ్గించేందుకు ఎంతో సహాయపడతాయి కాబట్టి.
బరువు తగ్గే ప్రయాణంలో మీరు కేలరీలను అస్సలు తీసుకోకడదు. అంటే చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నీటిలో కేలరీలు అస్సలు ఉండవు. అంటే నీళ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీర బరువును సులువుగా తగ్గించొచ్చు. అంతేకాదు ఈ నీళ్లు మీ శరీరాన్ని ఎనర్జిటిక్ గా కూడా ఉంచుతాయి.
చిరుతిండి తీసుకోకుండా నీరు మిమ్మల్ని నిరోధిస్తుంది.. ఎప్పటికప్పుడు నీరు తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీకు మళ్లీ..మళ్లీ.. ఆకలిగా అనిపించదు. ఇది సమయం లేకుండా తినకుండా మిమ్మల్ని కాపాడుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. చిరుతిండిని తీసుకోవడం ద్వారా.. మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి.
తినడానికి ముందు నీరును తాగండి.. తినడానికి ముందుగా నీళ్లను ఖచ్చితంగా తాగాలి. నిజానికి తినడానికి ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో మీరు ఎక్కువగా తినలేరు. అంతే కాదు నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల మీకు అజీర్థి సమస్య కూడా ఉండదు. వాస్తవానికి చాలా మందికి తిన్న వెంటనే నీరు తాగడం లేదా తినేటప్పుడు పదేపదే నీళ్లను తాగే అలవాటు ఉంటుంది. ఇది పూర్తిగా సరైనది కాదు. ఇది మలబద్ధకంతో సహా అనేక సమస్యలకు దారితీస్తుంది. తినడానికి అరగంట ముందు నీళ్లను తాగాలి. ఇక తిన్న అరగంట తర్వాతే నీళ్లను తాగాలి.
గోరువెచ్చని నీళ్లు.. మీ శరీరంలో మొండి కొవ్వు పేరుకుపోయినట్లయితే.. అప్పుడు మీరు గోరువెచ్చని నీటితో దానిని సులువుగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిని మీ దినచర్యలో చేర్చండి. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇందుకోసం ఆపిల్ వెనిగర్, నిమ్మ, తేనెను ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. దీంతో కొన్ని రోజుల్లోనే ఊబకాయం మీకు బై బై చెబుతుంది. ప్రతిరోజూ 10 గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు.