Hair Fall: వీటిని తింటే జుట్టు అస్సలు ఊడిపోదు..

First Published May 27, 2022, 12:42 PM IST

Hair Fall: జుట్టు వివిధ కారణాల వల్ల ఊడిపోతూ ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అవేంటంటే.. 

hair fall

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. వివిధ కారణాల వల్ల జుట్టు రాలుతుంది. తలపై చుండ్రు ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

ఆకు కూరలు.. ఆకుకూరల్లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల ఆకుకూరలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గుడ్లు.. జుట్టు ఆరోగ్యానికి గుడ్లు గొప్ప ఆహారం. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని ప్రోటీన్ కంటెంట్ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Sprouts

మొలకలు.. మొలకలు జుట్టు ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. పప్పుధాన్యాలలో ఇనుము, జింక్ మరియు బయోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 

చేపలు.. మీ ఆహారంలో చేపలను చేర్చడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగుంటుంది. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 

వాల్ నట్స్.. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీ ఆహారంలో వాల్ నట్స్ ను చేర్చుకోండి. వీటిలో బయోటిన్, విటమిన్లు బి , బి1, బి6, మరియు బి9, విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును బలోపేతం చేసి మాడుకు పోషణను అందిస్తాయి.

జామపండు.. విటమిన్ సి పుష్కలంగా ఉండే జామపండు, నారింజ, నిమ్మ వంటి పండ్లు విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ విటమిన్ సి జుట్టు పగిలిపోకుండా నివారిస్తుంది. అందులో జామపండులో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ యాక్టివిటీని పెంచడానికి ఇది సహాయపడుతుంది.
 

బార్లీ.. బార్లీలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. బార్లీలో ఐరన్ మరియు కాపర్ కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
 

అవిసె గింజలు.. అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు, కణ పొరలను సులభంగా చేరతాయి. అలాగే ఫోలికల్స్ పోషణను అందిస్తాయి.

క్యారెట్లు.. క్యారెట్లు కళ్లకు మాత్రమే కాదు, మీ జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది కూడా.  జుట్టు పగుళ్లు రాకుండా నిరోధిస్తుంది.

పాల ఉత్పత్తులు.. పాల ఉత్పత్తులు జుట్టు పెరుగుదలకు అద్భుతమైన ఆహారం అనే చెప్పాలి. పాలు, పెరుగు మరియు గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్ బి 12, ఐరన్, జింక్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పాల ఉత్పత్తులు బయోటిన్ (విటమిన్ బి 7) యొక్క గొప్ప మూలం. ఇది జుట్టు రాలడంతో పోరాడటానికి సహాయపడుతుంది. 

click me!