Raw Milk: హలో.. పచ్చిపాలను తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే.. వాటిజోలికే వెళ్లరు తెలుసా..

Published : May 20, 2022, 02:19 PM IST

Raw Milk: కొంతమంది పచ్చిపాలను తాగితే మరికొంతమంది వేడిచేసిన పాలను తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పచ్చిపాలు మంచివని కొందరంటే.. కాదు కాచిన పాలే మంచివని మరికొంతమంది అంటుంటారు. ఇంతకీ ఏ పాలను తాగితే మంచిదో తెలుసుకుందాం పదండి.   

PREV
16
Raw Milk: హలో.. పచ్చిపాలను తాగుతున్నారా? ఈ విషయాలు తెలిస్తే.. వాటిజోలికే వెళ్లరు తెలుసా..

పాలు దాదాపుగా అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.  ఈ కారణంగానే  అందరూ పాలను తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. 
 

26

పాలే కాదు పాల ఉత్పత్తులైన వెన్న, పెరుగు, మజ్జిగ లాంటి ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. 

36

పాలను పచ్చిగా తాగాలా? లేదా మరిగించి తాగాలా.. పాలను నేరుగా తాగే విషయానికి వస్తే.. పచ్చి పాలను తాగాలా... లేక మరిగించి తాగాలా అన్ని విషయం గురించి చాలా చర్చే జరుగుతోంది. ఇంతకీ పాలను ఏ విధంగా తాగాలో తెలుసుకుందాం పదండి. 

46

పచ్చి పాలను తాగితే ఏమౌతుంది.. వాస్తవానికి పచ్చిపాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఇలా తాగితే మీ ఆరోగ్యానికి హానీ కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. U.S. Health Protection Agency, Food and Drug Administration ప్రకారం.. ముడి పాలలో Escherichia cola (E. coli), లిస్టెరియా (Listeria), సాల్మెనెల్లా (Salmonella )వంటి హానికరమై బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిని తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

56

ముడి పాలను తాగడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు.. పచ్చిపాలలో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి  హానీ చేస్తుంది. ముఖ్యంగా ఈ పాలను తాగితే ఆర్థరైటిస్, డయేరియా, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.
 

66

పచ్చిపాలు ఎందుకు తాగకూడదు.. ఆవులు, గేదెల నుంచి పాలను నేరుగా తీసినప్పుడు పొదుగుకు ఉండే కలుషిత పదార్థాలు, క్రిములు ఆ పాలలలో కలుస్తాయి. ఇక వీటిని మరగబెట్టకుండా నేరుగా తాగితే ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే శరీరానికి అస్సలు మంచిది కాదు. అందుకే పాలను ఎప్పుడూ పచ్చిగా తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

click me!

Recommended Stories