మష్రూమ్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు!

Published : May 20, 2022, 01:29 PM IST

మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కనుక మష్రూమ్స్ తో ఎప్పటికప్పుడు కొత్త వంటలను ట్రై చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.  

PREV
17
మష్రూమ్ మసాలా కర్రీ.. ఇలా చేస్తే తిననివారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు!

కాబట్టి ఈసారి మష్రూమ్ తో మసాలా రెసిపీని ట్రై చెయ్యండి. ఈ మష్రూమ్ మసాలా కర్రీని రోటీలతో తీసుకుంటే భలే రుచిగా (Delicious) ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం మష్రూమ్ మసాలా కర్రీ (Mushroom masala curry) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: ఒక ప్యాకెట్ మష్రూమ్స్ (Mushrooms), మూడు టేబుల్ స్పూన్ ల పల్లీలు (Peanuts), రెండు టీస్పూన్ ల నువ్వులు (Seasame), రెండు టీస్పూన్ ల గసగసాలు (Poppies), ఒక పెద్ద ఉల్లిపాయ (Onion), సగం కప్పు టమోటా పేస్ట్ (Tomato paste), రెండు ఎండు మిరపకాయలు (Dried chillies), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste).
 

37

ఒక టీస్పూన్ కారం (Chili powder), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం టీస్పూన్ గరం మసాల (Garam masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం టీస్పూన్ జీలకర్రపొడి (Cumin powder), ఒక టీస్పూన్ ధనియాలపొడి (Coriander powder), రెండు టేబుల్ స్పూన్ ల వెన్న (Butter), కొత్తిమీర (Coriander) తరుగు, మూడు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నీళ్లు (Water), కట్ చేసుకున్న మష్రూమ్ (Mushrooms) ముక్కలను వేసి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న మష్రూమ్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని వెంటనే చన్నీళ్లను పోసుకోవాలి. ఇలా చన్నీళ్లను కలుపుకుంటే మష్రూమ్స్ ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి.
 

57

మసాలాకోసం స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు, ఎండు మిరపకాయలను వేసి బాగా ఫ్రై (Fry) చేసుకోవాలి. తరువాత ఇందులో నువ్వులు, గసగసాలను వేసి తక్కువ మంట (Low flame) మీద చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 

67

ఇప్పుడు స్టవ్ మీద మరోసారి కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడిక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొన్ని నీళ్లు పోసి రెండు నిముషాల పాటు బాగా వేపుకోవాలి (Cook well).
 

77

ఇప్పుడు ఇందులో టమోటో పేస్ట్ (Tomato paste) వేసి తక్కువ మంట మీద బాగా ఉడికించుకోవాలి. టమోటా పేస్ట్ బాగా మగ్గిన తరువాత ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లీమసాలాను కూడ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో ముప్పావు కప్పు నీళ్లు, మష్రూమ్ ముక్కలు, వెన్న, కొత్తిమీర తరుగు వేసి తక్కువ మంట మీద కూర నుంచి 
నూనె పైకి తేలే వరకు ఉడికించుకోని స్టవ్ ఆఫ్   చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ (Ready).

click me!

Recommended Stories