ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి నగరంలోనూ మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతుందే కానీ… తరగడం లేదు. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే తిరిగి పూర్తిగా తగ్గడం కుదరదు. కానీ దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కళ్ళు, రక్తనాళాలు, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే వైద్యులు సూచించిన మందులు వాడాలి. అలాగే సమతుల్య ఆహారం, వ్యాయామం, కొన్ని రకాల పానీయాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.