HeatWave: వడదెబ్బ తగలకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న ఆరోగ్య శాఖ..

Published : May 03, 2022, 02:56 PM IST

HeatWave: ఏప్రిల్ నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ త్రీవమైన ఎండలకు జనాలు ఇండ్ల నుంచి అస్సలు బయటకు రాకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ ఎండలకు బయటకు వెళ్లేవాళ్లకు వడదెబ్బ తగలకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే.   

PREV
112
HeatWave: వడదెబ్బ తగలకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న ఆరోగ్య శాఖ..

ఈ ఏడాదిలో ఎండలు ఏప్రిల్ నుంచి దంచి కొడుతున్నాయి. ఈ భయంకరమైన ఎండలకు ప్రజలు అస్సలు బయటకు రాకూడదని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు కొన్ని ఆరోగ్య జాగ్రత్తలను తప్పక తీసుకోవాలని సూచనలు చేసింది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

212

ఈ వేసవిలో దాహం వేసినా.. వేయకపోయినా ఖచ్చితంగా నీళ్లను తాగాలి. ఎందుకంటే  ఈ సీజన్ లో మన శరీరంలో ఉండే నీరంతా మూత్రం, చెమట రూపంలో బయటకు పోతూనే ఉంటుది. ఇలాంటి సమయంలో శరీరానికి కావాల్సిన నీళ్లను తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ తో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి. 
 

312

పనులపై బయటకు వెళ్లేవారు వాటర్ బాటిల్ ను తీసుకెళ్లడం మర్చిపోకూదు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను తరచుగా తాగుతూ ఉండాలి. ఇవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జీగా ఉంచుతాయి. 

412

ఈ సీజన్ లో మజ్జిగ, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూసెస్ ను ఎక్కువగా తాగుతూ ఉంటాలి. ఇవి మిమ్మల్ని హెల్తీగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

512

ఈ సీజన్ లో లభించే పండ్లను ఎక్కువగా తినాలి. పుచ్చకాయ, ద్రాక్షలు, దోసకాయ, మస్క్ మెలన్, పైనాపిల్, ఆరెంట్ లాంటి పండ్లు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి. 

612

వేసవిలో టైట్ గా ఉండే జీన్స్ టీషట్స్ కు దూరంగా ఉండటమే మంచిది. వీటి వల్ల శరీర  ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువ అవుతుంది. అంతేకాదు వేడి బయటకు పోదు. కాబట్టి ఈ సీజన్ లో ఎక్కువగా కాటన్ బట్టలను, వదులుగా ఉండే వాటినే ఎక్కువగా వేసుకోవాలి. 

712

మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎండలు దారుణంగా కొడతాయి. ఆ సమయంలో  మీరు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒక ఇంట్లోకి వేడి గాలులు రాకుండా తలుపులు పెట్టుకోవడం మంచిది. 

812

ఎండలకు చేయకూడనివి.. ఎర్రటి ఎండలో బయటకు వెళ్లకండి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి  3 గంటల మధ్య కాలంలో ఎంత పని ఉన్నా బయటకు వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

912

వంటను ఎండరాకముందే అంటే ఉదయం 10 గంటల మునుపే కంప్లీట్ చేసుకుంటే మీ ఇంట్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆ తర్వాత చేశారో ఇంట్లో గాలంతా వేడిగా మారిపోతుంది. వంట గదిలో కిటికీలను తెరచి ఉంచితే వేడి బయటకు పోతుంది. 
 

1012

ఈ సీజనో లో కూల్ డ్రింక్ లను అస్సలు తాగకూడదు. అలాగే టీ,. కాఫీలను కూడా తాగకపోవడమే మంచిది. వీటిని తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. 

1112

గర్భిణులు, చిన్నపిల్లలు, ముసలి వాళ్లు బయటకు వెళ్లకపోవడమే మంచిది. వేడి గాలుల వల్ల అస్వస్థత, వికారం, వాంతులు, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
 

1212

గుండె జబ్బులు, హై బీపీ, వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎండలకు బయటకు అస్సలు వెల్లకూడదు. వేడి గాలులు వీరిని మరింత ప్రమాదంలో పడేస్తాయి. వీరు తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి.  

  
 

 

click me!

Recommended Stories