relationship issues: తెలిసో.. తెలియకో మీరు చేసే ఈ పనులే మీ రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యేలా చేస్తాయి జాగ్రత్త..

First Published | May 3, 2022, 12:49 PM IST

relationship issues: తెలిసో తెలియకో మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ  బంధం బలహీనపడటమే కాదు.. మునపటిలా మీరు ఎప్పటికీ ఉండలేరు కూడా. 
 

బంధాన్నిఏర్పరుచుకోవడం ఎంత సులువో దాన్ని కలకాలం నిలబెట్టుకోవడం ప్రస్తుత కాలంలో చాలా కష్టమైన పని.  అందుకే కదా చాలా మంది సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే  సాధారణ వ్యక్తులు సైతం చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. కానీ పెళ్లైన ప్రతి జంట తాము కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆశపడుతుంటారు.  కానీ వీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే ఇరువురి మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇలాంటి విషయాల వల్ల పార్టనర్స్ మునపటిలా ప్రేమగా అస్సలు ఉండలేరు. అందుకే ఈ   విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి.. 
 

ప్రతి జంట తమ సెక్స్ గురించి ఎన్నో అనుకుంటారు. అయితే కొంతమంది మాత్రం ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ.. వాటిని ప్రయత్నిస్తుంటారు. ఇది పార్టనర్ ను ఇబ్బందిపెట్టడం తప్ప సంతోషాన్ని ఇవ్వదు. ఇది మీ శారీరక సంబంధాన్నే కాదు మీ సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది.  
 


వైవాహిక జీవితంలో సెక్స్ కూడా ముఖ్యమే కానీ.. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటే మాత్రం మంచిది కాదు. సెక్స్ యే ప్రేమ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. మీ భాగస్వామి కూడా ఇలాగే ఉంటే మీ బంధం గురించి మరోసారి ఆలోచించాల్సిందే. 

రిలేషన్ షిప్ లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. వీటిని ఎంత తొందరగా మర్చిపోతే మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు దాన్నే పట్టుకుని వేళాడితే మీ బంగారం లాంటి లైఫ్ చేతులారా పాడుచేసుకున్నవారవుతారు. మీ బంధం కూడా బలహీనపడుతుంది. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు కూర్చొని మాట్లాడుకోండి. 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకరినొకరు గౌరవించుకోవాలి. వారి గోప్యతను గౌరవించాలి. చెప్పు చెప్పు అంటూ ఫోర్స్ చేయకండి. ఇష్టముంటే వాళ్లే చెబుతారు కదా. ముఖ్యంగా ఈ విషయం నాకు చెప్పాల్సిందే అంటూ ఒత్తిడి మాత్రం తీసుకురాకండి. దీనివల్ల మీ బందం బలహీనపడుతుంది. 

గొడవ పడుతున్నప్పుడు మీరు ఊరికే భావోద్వేగానికి గురి కావడం అస్సలు మంచిది కాదు. కొందరు గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్దగా ఏం జరగకపోయినా ఏడుస్తుంటారు. దీనివల్ల ఆ గొడవకు కారణం మీరు కాదు మీ పార్టనర్ ఒక్కడే అన్న కాడికి వస్తుంది. దీనివల్ల మీ పార్టనర్ ఎదుటివారి ముందు దోషిలా నిలబడతాడు. ఇలాంటి ప్రవర్తన కూడా మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. మీ పార్టనర్ కు మీ మీద ప్రేమ మొత్తం పోతుంది. నమ్మకమూ ఉండదు.  

Latest Videos

click me!