పొడి జుట్టు అనేది చాలా మందికి ఒక సాధారణ సమస్య. వివిధ కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. పొడిబారడం ఎదుర్కోవటానికి, మంచి మాయిశ్చరైజింగ్ షాంపూ , కండీషనర్‌ని ఉపయోగించాలి. అదనంగా, సీరం అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా నిరోధించవచ్చు. ఈ కింది హోం రెమిడీలు కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి.
పండిన అరటిపండు తీసుకుని బాగా మెత్తగా నలపండి. పెరుగు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ని మీ జుట్టుకు సమానంగా అప్లై చేసి, తర్వాత మీ జుట్టును కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్‌తో కప్పండి. 20 నిమిషాల నుండి ఒక గంట వరకు అలాగే ఉంచి, తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మృదువుగా, హైడ్రేటెడ్‌గా మార్చడంలో సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కోసం, ఈ మాస్క్‌ని వారానికి ఒకసారి ఉపయోగించండి.
ఒక టేబుల్ స్పూన్ తేనెను పండిన అవకాడో గుజ్జుతో కలపండి. తర్వాత, ఒక గుడ్డు నుండి గుడ్డులోని తెల్లసొనను కలిపి బాగా కలపండి. మీకు నచ్చిన నూనె కొన్ని చుక్కలను కూడా మీరు జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ నెత్తికి , జుట్టుకు అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఈ చికిత్సను వారానికి రెండు నుండి మూడు సార్లు చేయవచ్చు.
కలబంద జెల్‌ను కొబ్బరి నూనెతో కలిపి మీ జుట్టుకు రాసుకుంటే కూడా పొడిబారడం తగ్గుతుంది.
మెంతులను నీటిలో నానబెట్టి, ఆ నీటితో మీ జుట్టును కడగడం వల్ల కూడా పొడిబారడం తగ్గుతుంది.