Crystal Mala: ఈ మాల ధరిస్తే దయ్యాలు, ఆత్మల నుంచి రక్షణ లభిస్తుందా?

Published : Dec 10, 2025, 01:18 PM IST

Crystal Mala: స్పటిక మాల ఎంతోమంది మెడలో కనిపిస్తుంది. దీన్ని ధరించడం వల్ల దెయ్యాలు, భూతాలు, ఆత్మల వల్ల రక్షణ లభిస్తుందని సాంప్రదాయ విశ్వాసాలు చెబుతాయి. ఈ మాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి. 

PREV
15
స్ఫటిక మాల అంటే ఏమిటి?

స్పటిక మాలలు దేవాలయాల్లో, పూజల్లో పాల్గొన్న ఎంతోమంది మెడలలో కనిపిస్తాయి. స్ఫటిక మాల ఏమిటో? ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చాలామందికి తెలియదు. స్పటిక మాల ఎంతో పారదర్శకంగా ఉండేది. ఇందులో వాడే స్పటికాలు పూర్తిగా మంచు ముక్కలా మెరిసే రాయిల్లాంటివి. ఇవి సహజంగా చల్లని శక్తిని కలిగి ఉంటాయి. వీటిని పూజలు, యోగా, ధ్యానం చేసేటప్పుడు మెడలో వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎంతో మంది నమ్మకం.

25
క్రిస్టల్ మాల వేసుకుంటే ఏమవుతుంది?

స్పటికం సహజంగానే చల్లని శక్తిని కలిగి ఉన్న రాయి. ఇక మాలగా గుచ్చుకొని మెడలో వేసుకుంటే మనసు నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. ఒత్తిడి, టెన్షన్ అధికంగా పడే వారికి ఈ స్పటిక మాల ఎంతో ఉపయోగపడుతుందని చెబుతారు. అలాగే ఇంటి వాతావరణాన్ని, వ్యక్తి ఆలోచనలను కూడా పాజిటివ్ గా మార్చడంలో స్పటిక మాల ఉపయోగపడుతుందని అంటారు. నెగటివ్ ఎనర్జీని తగ్గించి మంచి భావాలు పెంచడంలో స్పటిక మాల ముందుంటుంది. ముఖ్యంగా దీన్ని జపమాలగా ఉపయోగిస్తూ ఉంటారు. జపం చేసేటప్పుడు స్పటిక మాలను చేత్తో పట్టుకోవడం వల్ల మనసు స్థిరంగా ఉంటుందని ఎంతోమంది నమ్మకం.

35
స్ఫటిక మాల వల్ల ఉపయోగాలు

స్పటిక మాలను శరీరంలోని వేడిని తగ్గించడమే కాదు, రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఇది కచ్చితంగా చెప్పే సంపూర్ణ వైద్య ఆధారాలు మాత్రం లేవు. కానీ ప్రజలు మాత్రం స్పటిక మాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అని నమ్ముతారు. ఇక జ్యోతిషం ప్రకారం చూస్తే శని గ్రహ దోషాలను స్పటికం ఎంతో కొంత తగ్గిస్తుంది అని నమ్ముతారు. అందుకే ఇంటికి శాంతి, సంపద తీసుకొచ్చే శక్తికి ఈ మాలకు ఉందని మెడలో ధరిస్తారు.

45
దెయ్యాలు, ఆత్మల నుంచి రక్షణ

స్పటిక మాల వేసుకుంటే భూతాలు, దెయ్యాలు, ఆత్మల నుంచి రక్షణ ఇస్తుంది అనేది సంప్రదాయ విశ్వాసాల్లో భాగంగానే ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారము లేదు. దీన్ని నమ్మాలా? వద్దా? అనేది వ్యక్తుల వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మీరు దీన్ని నమ్మకంతో వేసుకుంటే ఇది మీకు అన్ని పాజిటివ్ ఫలితాలని అందిస్తుంది. చెడు శక్తులను కూడా దూరం చేసే సామర్థ్యం దీనికి ఉందన్నది ఎంతోమంది విశ్వాసం.

55
ఎవరు వేసుకోవాలి?

ఎక్కువగా టెన్షన్ పడేవారు, మానసిక ఆందోళనతో బాధపడేవారు స్పటికమాలను వేసుకుంటే మంచిదని అంటారు. అలాగే శనిదోషం ఉన్నవారు, జపాలు చేసేవారు, ఇంట్లో శాంతిని కోరుకునే వారు కూడా స్పటిక మాలలు ధరిస్తే మేలు జరుగుతుంది. ఇక ప్రతిరోజూ ధ్యానం చేసేవారు స్పటిక మాలలు వేసుకోవడం వల్ల రెండింతలు ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. అయితే కోపం, డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ మాలను వేసుకోకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇలా వేసుకోవడం వల్ల స్ఫటిక మాల శక్తి పై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటుంది. అయితే ఒక వ్యక్తి స్పటికమాలను వేసుకుంటే అది అతనికి మాత్రమే చెందినది. ఇతరులు దానిని తీసుకొని వేసుకోకూడదు అని పండితులు సూచిస్తున్నారు. క్రిస్టల్ మాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలానే ప్రతిరోజు నీటిలో ఓసారి ముంచి తీస్తే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories