జామకాయ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే జామకాయను తొక్కతో పాటు తినాలని చెబుతారు. అలాగే గింజలను కూడా తినాలని చెబుతారు వైద్య నిపుణులు. అయితే జామకాయ గింజలు తింటే కడుపునొప్పి వస్తుంది అనే మాట ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు గింజలు మింగితే జీర్ణం కావని పొట్టనొప్పి వచ్చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.