జీన్స్‌ ప్యాంట్స్‌కి ఈ రాగి బటన్స్‌ ఎందుకు ఉంటాయి? వీటి ఉపయోగం ఏంటంటే..

First Published | Jan 10, 2025, 11:21 AM IST

ఎక్కువ మంది ధరించే ప్యాంట్స్‌లో జీన్స్‌ మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జీన్స్‌ను ఎంతో ఇష్టంగా ధరిస్తుంటారు. అయితే జీన్స్‌ ప్యాంట్‌ను గమనిస్తే చిన్న ప్యాకెట్స్‌ దగ్గర రాగి బటన్స్‌ ఉండడం గమనించే ఉంటాం. అయితే వీటి ఉపయోగం ఏంటో తెలుసా.? 
 

పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడే దుస్తుల్లో జీన్స్‌ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా జీన్స్‌కు మంచి ఆదరణ ఉందని తెలిసిందే.

బూట్‌ కట్‌, పెన్సిల్‌ కట్‌ ఇలా డిజైన్స్‌లో ఎన్ని రకాల మార్పులు వచ్చినా జీన్స్‌కు ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఎక్కువ కాలం మన్నిక ఇవ్వడంతో పాటు చూడ్డాని స్టైల్‌గా ఉండడమే ఈ ప్యాంట్స్‌ను ఎక్కువ మంది ఇష్టపడడానికి కారణం చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే జీన్స్‌ ప్యాంట్స్‌కి ఉండే పాకెట్స్‌ చివరల్లో చిన్న బటన్స్‌ను గమనించే ఉంటారు. ఈ బటన్స్‌ను రాగితో చేసినవి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అయితే రాగి బటన్స్‌ను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు.? దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటన్న దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా.?

అయితే జీన్స్‌కి రాగి బటన్స్‌ పెట్టడం వెనకాల ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఈ రాగి బటన్స్‌ అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జీన్స్‌ ప్యాంట్‌ చరిత్ర విషయానికొస్తే 19వ శతాబద్ధం మధ్యలో జాకబ్ డేవిస్‌ అనే వ్యక్తి కనిపెట్టారు. వ్యవసాయ కార్మికుల కోసం ధృడమైన ప్యాంటు తయారు చేయాలనుకున్నారు.

బరువైన వస్తువులను జేబుల్లో వేసుకోవడం వల్ల జీన్స్‌ ప్యాంట్‌ జేబులు చిరిగిపోవడాన్ని గమనించి జాకస్‌ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను రాగి బటన్స్‌ను ఉపయోగించారు. ప్యాంట్‌ జేబులు దృఢంగా ఉండేందుకు డేవిస్ రాగి రివెట్‌లను ఉపయోగించడం ప్రారంభించాడు.

స్టీల్‌ కూడా దృఢంగా ఉంటుందనే అనుమానం వస్తుండొచ్చు. అయితే దుస్తులను ఉతికితే అవి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో జేబులు బలహీనంగా మారుతాయి. అందుకే స్టీల్‌ స్థానంలో రాగి బటన్స్‌ను ఉపయోగిస్తారు.

రాగి నీటిలో తుప్పు పట్టదు. ఇలా కాలక్రమేణ జీన్స్‌ ప్యాంట్‌ జేబులకు రాగి బటన్స్‌ను ఉపయోగిస్తుండడం ఆనవాయితీగా వచ్చింది. ఇదండి మనం వేసుకునే జీన్స్‌ ప్యాంట్‌ల వెనకాల ఉన్న అసలు కథ. 

Latest Videos

click me!