Vaikuntha Ekadashi
సంవత్సరకాలంలో ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ వీటన్నింటిలో వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా, అత్యంత ముఖ్యమైందిగా పరిగణిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఈ దేవుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
శాస్త్రాల ప్రకారం.. వైకుంఠ ఏకాదశి నాడు కఠినమైన ఉపవాసం ఉండి, నియమాల ప్రకారం.. పూజ చేసిన వారికోసం విష్ణువుమూర్తి వైకుంఠ ద్వారాలను తెరుస్తాడని చెప్తారు. అంతేకాదు వీరు తెలిసీ, తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయట. పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఈరోజున అంటే జనవరి 10 జరుపుకుంటున్నాం. అందుకే ఈ పవిత్రమైన రోజుకు సంబంధించిన కొన్ని నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వైకుంఠ ఏకాదశి నాడు ఈ పని ఖచ్చితంగా చేయండి
ఉపవాసం: ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి ఉపవాసం నాడు సాత్విక్తాన్ని పాటించాలి. అలాగే తామసిక పదార్థాలు వేసిన ఏ ఆహారాలను తినకూడదు. అలాగే మీరు ఈ ఉపవాసాన్ని ద్వాదశి తిథి నాడు మాత్రమే విరమించాల్సి ఉంటుంది. .
పూజలు: ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండేవారు పొద్దున్నే నిద్రలేచి, పవిత్ర స్నానం చేయాలి. అలాగే నిష్టగా పూజలు చేయాలి. వీటితో పాటుగా ఉపవాసం కథను కూడా పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు.
మంత్రాల జపం: వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు వేద మంత్రాలను పఠిస్తే పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పూజా ఫలం దక్కాలంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా శ్రీ హరి నామాలను జపించండి.
ఆలయాన్ని సందర్శించండి: పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. పూజలు, ప్రార్థనలు చేయండి. అలాగే పేదలకు అవసరమైన ఆహారం, వెచ్చని దుస్తులు వంటి వాటిని దానం చేయండి. మీకు పుణ్యం దక్కుతుంది. అలాగే మీకు శాంతి, ఆనందం కలుగుతాయి.
వైకుంఠ ఏకాదశి శుభ యోగం
హిందూ క్యాలెండర్ ప్రకారం.. శుభ యోగం ఉదయం నుంచి మధ్యాహ్నం 02:37 వరకు ఉంటుంది. సంధ్యా ముహూర్తం సాయంత్రం 05:40 నుంచి 06:07 వరకు ఉంటుంది. అలాగే అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:48 వరకు ఉంటుంది.