Crispy Vada: ఇంట్లో చేసిన వడలు హోటల్‌లో లాగా కరకరలాడవు, పైగా వెంటనే మెత్తబడిపోతాయి. హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు చేయాలంటే, వాటిని రెండుసార్లు వేయించాలి. మొదట మీడియం మంటపై, తర్వాత ఎక్కువ మంటపై వేయిస్తే వడలు ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి.
గారెలు లేదా వడలు.. ఎక్కువ మంది హోటల్స్ లో తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇడ్లీకి తోడుగా వడ ఉండాల్సిందే. కానీ ఇంట్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా గారెలు హోటల్ స్టైల్‌లో రావు. కరకరలాడవు. మెత్తగా వస్తాయి. పిండి పర్ఫెక్ట్‌గా కలిపినా వడలు హోటల్ టేస్ట్ రావు. వేడివేడిగా ఉన్నప్పుడు పోనీ కరకరలాడినా, పది నిమిషాల్లోనే మెత్తగా అయిపోతాయి. మరి గారెలు కరకరలాడాలంటే ఏం చేయాలి?
24
వెంటనే మెత్తబడిపోతున్నాయా?
కానీ అసలు విషయం అది కాదు. మీరు పిండిని సరిగ్గా కలిపినా, కొన్నిసార్లు వడ లోపల ఉడకదు, బయట మాడిపోతుంది. బయట క్రిస్పీగా ఉన్నా లోపల పచ్చిగా ఉంటుంది. ఎందుకో తెలుసా?
34
ఈ టిప్స్ ఫాలో అవ్వండి
హోటల్ స్టైల్‌లో కరకరలాడే వడలు చేయాలంటే, మీరు పర్ఫెక్ట్‌గా కలిపిన పిండితో పాటు మరో ముఖ్యమైన చిట్కాను పాటించాలి. ఆ చిట్కా తెలియక ఎంతో మంది మెత్తటి గారెలతోనే సరిపెట్టుకుంటున్నారు. గారెలు క్రిస్పీగా రావాలంటే మీరు చిన్న పని చేస్తే సరిపోతుంది.
ఆ సీక్రెట్ ఏంటంటే.. వడలను రెండుసార్లు నూనెలో వేయించడం. మీరు ఎప్పుడైనా బయట బండి మీద గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. ముందుగా వడలను మీడియం మంటపై వేయించి తీసెయ్యాలి. అన్ని వడలు ఇలా చేశాక, మంటను పెంచి, వాటిని మళ్లీ నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా చేసి చూడండి, వడలు గంటల తరబడి కరకరలాడుతూ ఉంటాయి.