Newly wed Brides: అమ్మాయి జీవితంలో పెళ్లి ప్రధాన ఘట్టం. పెళ్లయ్యాక అమ్మాయిల జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతీ సమస్యకు పరిష్కారం కోసం గూగుల్‌లోనే వెతుకుతున్నారు అమ్మాయిలు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
పెళ్లి అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఆమె ప్రపంచమే చాలా కొత్తగా మారిపోతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలతో ఆమె ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ ఆ సమయంలోనే అమ్మాయి మనసులో ఎన్నో సందేహాలు మొదలవుతాయి. మొహమాటం వల్ల భర్తను గానీ, అత్తమామలను గానీ అడగలేని విషయాలను ఆమె గూగుల్ ని అడుగుతుంది. కొత్త పెళ్లికూతుళ్లు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఏం వెతుకుతారో తెలుసా?
24
భర్త కోసం
పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి తన భర్తతో బలమైన మానసిక బంధాన్ని కోరుకుంటుంది. తమ భర్త ఇష్టాలను అర్థం చేసుకోవాలని కోరుకుతుంది. ఇందుకోసం గూగుల్ లో భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, అతని మనసులో ప్రత్యేక స్థానం ఎలా సంపాదించాలి అనే విషయాలను అడుగుతుంది. అలాగే తమ బంధంలో ప్రేమ, రొమాన్స్ ఎలా తాజాగా ఉంచుకోవాలని అనే విషయాలపై గూగుల్ ను అధికంగా అడుగుతూ ఉంటారు.
34
భర్త నా మాట వినేలా చేయడం ఎలా?
ప్రతి భార్య కూడా బంధంలో తన భర్త తన మాట వినాలని కోరుకుంటుంది. తమ భర్త ఎలాంటి గొడవలు, వాదనలు లేకుండా తమతో ప్రేమగా ఉండేలా చేయడానికి టిప్స్ కూడా కొత్త పెళ్లికూతుళ్లు గూగుల్ ను అడుగుతున్నారు.
కొత్త కుటుంబంలో అత్తగారు, ఆడపడుచు లేదా ఇతర కుటుంబ సభ్యులతో కలిసిపోవడం మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే పెళ్లయిన అమ్మాయిలు అత్తగారింట్లో అందరికీ ఫేవరెట్ అవ్వడం ఎలాగో కూడా గూగుల్ ను అడుగుతున్నారు.
ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయిలే ఎక్కువ. పెళ్లి తమ కెరీర్‌ను వెనక్కి నెట్టేస్తుందేమోనని భయపడుతుంటారు. ఆఫీస్ పనికి, వ్యక్తగత జీవితం మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలని కూడా గూగుల్ అడిగే కొత్త పెళ్లికూతుళ్లు అధికంగానే ఉన్నారు.
పెళ్లయిన తరువాత గర్భధారణ విషయంలో ఉన్న సందేహాలను కూడా వారు గూగుల్ ను అడుగుతారు. తల్లి కావడానికి సరైన వయస్సు, గర్భం దాల్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గూగుల్ తల్లిని అడిగి తెలుసుకుంటారు.